Tirumala: తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడు సమర్పించిన బంగారు ఆభరణాల పూర్తి వివరాలు ఇవే

Updated on: Nov 26, 2026 | 5:40 PM

Vardhaman Jain Tirumala Donation: తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతుల దాతృత్వాన్ని ప్రశంసించారు. సంపద, హోదా శాశ్వతం కాదని.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే నిజమైన సంతృప్తిని ఇస్తాయని పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 5 వేల ఆలయాల నిర్మాణం, అన్నప్రసాదం, వైద్య సేవలు, తిరుమలకు నీటి సరఫరాపై కీలక ప్రకటనలు చేశారు.

1 / 9
తిరుమల: డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే మనిషికి అసలైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారని... కానీ సంపాదించిన సంపదను సద్వినియోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. ఆ కోవలోనే నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్న చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శంగా ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు.

2 / 9
గురువారం తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. టీటీడీ అర్చకులు, అధికారులు ఈ ఆభరణాలను స్వీకరించారు. అనంతరం ధాతలైన జైన్ దంపతులతో కలిసి సీఎం తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు.

3 / 9
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తిరుమల పవిత్ర క్షేత్రంలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని, ఇందులో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిరోజూ శ్రీవారికి 120 కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తారని, దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించామని జైన్ దంపతులు చెప్పడం వారి భక్తికి నిదర్శనమన్నారు. పూర్వం పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూర్, మరాఠా రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి రత్నకిరీటం, పీతాంబరం సహా ఎన్నో ఆభరణాలు సమర్పించారని, ఆనాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి జైన్ దంపతుల వరకు స్వామివారిపై భక్తి విశ్వాసాలు పెరుగుతూనే ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.

4 / 9
మానవ సేవే... మాధవ సేవ.. 
దేవునిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మానవ సేవే - మాధవ సేవ అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే వారే దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. జైన్ దంపతుల తరహాలోనే ఇతర సంపన్నులు కూడా ముందుకు వచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని టీటీడీ వారి సౌకర్యాలు, సేవలకే ఖర్చు చేస్తోందన్నారు.

మానవ సేవే... మాధవ సేవ.. దేవునిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మానవ సేవే - మాధవ సేవ అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే వారే దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. జైన్ దంపతుల తరహాలోనే ఇతర సంపన్నులు కూడా ముందుకు వచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని టీటీడీ వారి సౌకర్యాలు, సేవలకే ఖర్చు చేస్తోందన్నారు.

5 / 9
రాష్ట్రంలో టీటీడీ సహకారంతో 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టబోతున్నామని, దేశంలోని అన్ని రాజధానులతో పాటు విదేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఆలయం ఉన్న ప్రతిచోటా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, 'ప్రాణదానం' ద్వారా వైద్య సేవలు, 'విద్యాదానం' కింద ప్రత్యేక నిధితో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎల్ నినో వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'వృక్షో గోవిందం' పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపడతామన్నారు.

6 / 9
భవిష్యత్తులో తిరుమలకు నీటి ఎద్దడి అనే మాటే లేకుండా హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని, అవసరమైతే తిరుమలకు రెండో పైప్ లైన్ కూడా వేస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ, నాలెడ్జ్‌తో పాటు భగవంతుని కృప ఉండటం వల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

7 / 9

నమ్ముకున్న వారికి శ్రీవారి అండ... రక్షణ... 
పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయి... కానీ వెంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు. 	రోజు రోజుకూ శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపోందించడానికి చాలా మంది కృషి చేశారని చెప్పారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారని... అది తన విషయంలో నిరూపితమైందన్నారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి జరిగిందని... చాలా పకడ్బందీగా నాపై దాడి జరిగినా... స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారని... పునర్జన్మనిచ్చారంటూ సీఎం భావోద్వేగంతో నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు.

నమ్ముకున్న వారికి శ్రీవారి అండ... రక్షణ... పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయి... కానీ వెంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు. రోజు రోజుకూ శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపోందించడానికి చాలా మంది కృషి చేశారని చెప్పారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారని... అది తన విషయంలో నిరూపితమైందన్నారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి జరిగిందని... చాలా పకడ్బందీగా నాపై దాడి జరిగినా... స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారని... పునర్జన్మనిచ్చారంటూ సీఎం భావోద్వేగంతో నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు.

8 / 9
తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లుతోందని... దేవుని పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని... దీనికి టీటీడీ నాందీ పలకాలన్నారు. శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా... పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీవారి సేవకులు చాలా భక్తి విశ్వాసంతో సేవలు అందిస్తున్నారని... వారిని మరింత ప్రొత్సహించాలన్నారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలి... ఆ దేవాలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలని నిర్దేశించారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామని... విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

9 / 9
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు.. రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు.
శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు
శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం, 
శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం, 
బంగారు పాద కవచములు -3, 
బంగారు అందెలు -3, 
బంగారు పాకడాలు, 
బంగారు తులసిపాత్ర హారం, 
బంగారు అష్టోత్తర కాసుల మాల, 
బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం, 
బంగారు పులిగోరు, 
బంగారు అశ్వథ పాత్ర హారము,  
బంగారు సాదా వడ్డాణము, 
బంగారు గంటల మొలతాడు, 
బంగారు సూర్యకటారి, 
బంగారు కౌస్తుభం, 
బంగారు శ్రీవత్సం, 
బంగారు మోచేయి, 
బంగారు కటి హస్తం, 
బంగారు నాగాభరణ వడ్డాణము, 
బంగారు గోపు, 
బంగారు ఐదు పేటల కంఠీలు 5, 
బంగారు చంద్రవంకీ కంఠీ, 
బంగారు వైకుంఠ హస్తము, 
బంగారు కటి హస్తము, 
బంగారు నాగాభరణ కడియాలు 4, 
బంగారు భుజ కీర్తులు 3, 
బంగారు కర్ణపత్రములు 3, 
బంగారు భావళీలు -3, 
బంగారు సాలిగ్రామ హారములు- 3, 
బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3, 
బంగారు మోపుగల యజ్ఞోపవీతం,  
బంగారు శంఖ కవచము, 
బంగారు చక్ర కవచము, 
బంగారు కిటీపు ముఖపట్టి, 
బంగారు కిరీటము, 
2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం, 
238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు.. రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం, శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం, బంగారు పాద కవచములు -3, బంగారు అందెలు -3, బంగారు పాకడాలు, బంగారు తులసిపాత్ర హారం, బంగారు అష్టోత్తర కాసుల మాల, బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం, బంగారు పులిగోరు, బంగారు అశ్వథ పాత్ర హారము, బంగారు సాదా వడ్డాణము, బంగారు గంటల మొలతాడు, బంగారు సూర్యకటారి, బంగారు కౌస్తుభం, బంగారు శ్రీవత్సం, బంగారు మోచేయి, బంగారు కటి హస్తం, బంగారు నాగాభరణ వడ్డాణము, బంగారు గోపు, బంగారు ఐదు పేటల కంఠీలు 5, బంగారు చంద్రవంకీ కంఠీ, బంగారు వైకుంఠ హస్తము, బంగారు కటి హస్తము, బంగారు నాగాభరణ కడియాలు 4, బంగారు భుజ కీర్తులు 3, బంగారు కర్ణపత్రములు 3, బంగారు భావళీలు -3, బంగారు సాలిగ్రామ హారములు- 3, బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3, బంగారు మోపుగల యజ్ఞోపవీతం, బంగారు శంఖ కవచము, బంగారు చక్ర కవచము, బంగారు కిటీపు ముఖపట్టి, బంగారు కిరీటము, 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం, 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు.

Loading...
Unable to load recommendations.
Follow Us