చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి.. మార్మోగిన గోవింద నామస్మరణలు!

Updated on: Oct 13, 2026 | 12:34 PM

Tirumala Brahmotsavams 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. రాత్రి హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

1 / 6
Tirumala Navaratri Brahmotsavams: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (అక్టోబరు 13) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

2 / 6
గోవింద నామస్మరణలతో మార్మోగిన మాడ వీధులు.. 
చిన్నశేష వాహనసేవ తిరుమలలో కన్నులపండువగా సాగింది. ముందుగా గజాలు, అశ్వాలు కదులుతుండగా.. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గోవింద నామస్మరణలతో మార్మోగిన మాడ వీధులు.. చిన్నశేష వాహనసేవ తిరుమలలో కన్నులపండువగా సాగింది. ముందుగా గజాలు, అశ్వాలు కదులుతుండగా.. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

3 / 6

మరోవైపు భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారికి భక్తిశ్రద్ధలతో నీరాజనాలు పలికారు. దీంతో తిరుమల మాడ వీధులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి.

మరోవైపు భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారికి భక్తిశ్రద్ధలతో నీరాజనాలు పలికారు. దీంతో తిరుమల మాడ వీధులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి.

4 / 6

చిన్నశేష వాహనానికి ఉన్న ప్రత్యేకత ఇదే!.. 
వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడిని ‘శేషి’గా, సమస్త ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకి స్వరూపాన్ని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ తాత్విక భావనకు ప్రతీకగా నిలుస్తుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధికి సంబంధించిన ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

చిన్నశేష వాహనానికి ఉన్న ప్రత్యేకత ఇదే!.. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడిని ‘శేషి’గా, సమస్త ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకి స్వరూపాన్ని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ తాత్విక భావనకు ప్రతీకగా నిలుస్తుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధికి సంబంధించిన ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

5 / 6

 రాత్రి హంస వాహనంపై మలయప్పస్వామి..
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహనసేవను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాత్రి హంస వాహనంపై మలయప్పస్వామి.. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహనసేవను తిలకించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

6 / 6
ఉదయం జరిగిన చిన్నశేష వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us