
ఆర్థిక సమస్యలు ఉండటం కామన్. కానీ వాటి నుంచి ఎంత త్వరగా బయటపడ్డాం అనేదే ముఖ్యం. అయితే చాలా మంది చిన్నగా అప్పు చేసి, దాన్ని చాలా పెద్ద సమస్యగా మార్చుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది ఒక సమయానుగుణంగా జరగాలి అంట, అప్పుడే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండవు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో రుణ విమోచన ముహూర్తం అనేది కూడా ఒకటి ఉన్నదంట. దాని ప్రకారం అప్పులు తీర్చడం వలన త్వరగా మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉన్నదంట. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ముహూర్తాలు చూస్తారు.

అయితే ముహూర్తం చూడుకన్నా కూడా కొన్ని రోజులు అప్పు తీర్చడానికి చాలా శుభప్రదమైన రోజులు. అందులో ముఖ్యంగా మంగళ వారం అప్పు తీర్చడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు తీర్చడానికి అతి ముఖ్యమైన రోజు మంగళవారం. ఎవరు అయితే మంగళవారం రోజు అప్పు క్లియర్ చేస్తారో, ఇక జీవితంలో ఎక్కువగా అప్పులు చేసే సమస్యే రాదంట, అదే విధంగా, ఉన్న అప్పుల కూడా చాలా త్వరగా క్లియర్ అవుతాయంట.

అందువలన ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మంగళవారం మాత్రమే అప్పు తీర్చాలి. అలాగే అప్పు తీసుకోవడం కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో చేయాలి. ముఖ్యంగా సోమ వారం, గురు వారం అప్పు తీసుకోవడం మంచిది. అలాగే శని వారం రోజున శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. లేకపోతే అది తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.