
కొత్త సంవత్సరంలో చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే హిందూ మతంలో ఏ పని ప్రారంభించినా, లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేసినా శుభ ముహూర్తం చూడటం అనేది తప్పనిసరి. ఒక వేళ కొత్త వాహనం కొనుగోలు చేసినట్లు అయితే, ఆ రోజు తిథి, ఘడియ, మంచి సమయం, మంచి రోజు చూసి కొనుగోలు చేస్తారు. కాగా, కొత్త సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయో చూద్దాం.

ఇక ఇలా నూతన వాహనం కొనుగోలు చేసినా, కొత్త ఇంటికి మారడం, లేదా కొత్త ఇంటిలోకి అడుగు పెట్టినప్పుడు శుభ ముహూర్తం చూడడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అయితే వాహనం కొనుగోలు చేయడం అనేది కూడా కుటుంబానికి ఒక పెద్ద అడుగు లాంటిది. అందువలన దీనికి సరైన ముహూర్తం చూసుకోవడం ద్వారా, అదృష్టం వరించడమే కాకుండా, సురక్షితమైన ప్రయాణాలకు కారణం అవుతుంది.

అయితే గ్రహ స్థానాలను బట్టి ఫలితాలు ఉంటాయని, మంచి సమయం, శుభ గడియలు చూస్తుంటారు. దీని వలన ప్రయాణాల్లో ఆటంకాలు రాకుండా, ఇంటా బయట అంత సానుకూల వాతావరణం ఉంటుందని నమ్మకం. అలాగే ఇలా శుభ ముహూర్తాలు చూసి చేసిన ఏ పని అయినా చాలా త్వరగా విజయవంత అవుతుందంట. కాగా, ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరిలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తాలు ఏవో చూద్దాం.

2026 సంవత్సరం జనవరిలో జనవరి 1, గురువారం, ఉదయం 7.14 నిమిషాల నుంచి 10 :22 నిమిషాల వరకు ఉంది. జనవరి 2 శుక్రవారం ఉదయం 4 :50 ని, నుంచి సాయంత్రం 6 వరకు శుభ సమయం. జనవరి 4 ఆదివారం, ఉదయం 7 :15ని, నుంచి మధ్యాహ్నం 12 :29 నిమిషాల వరకు శుభ ముహూర్తం ఉంది. జనవరి 5 సోమవారం, జనవరి 12 సోమవారం, జనవరి 14 బుధ వారం, జనవరి 22 , జనవరి 28, జనవరి 29 వరకు నూతన వాహనం కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తాలు ఉన్నాయంట.

ఇక ఫిబ్రవరి నెలలో, పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 7 :10 నిమిషాల నుంచి 11:50pm వరకు, అలాగే, ఫిబ్రవరి 6 శుక్రవారం, ఉదయం 6 గంటల నుంచి ఆ రోజు మొత్తం శుభ సమయమే, అలాగే ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 9:58 నుంచి 10: 58 వరకు శుభ సమయం. అలాగే ఫిబ్రవరి 26, ఫిబ్రవరి 27 వరకు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి శుభ ముహూర్తాలు ఉన్నాయి.