Bullock Cart Bandi Festival: కర్ణాకటలో మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఘనంగా ఎడ్ల బండ్ల ఉత్సవం..

|

Jan 03, 2023 | 5:43 PM

సంక్రాంతి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనల తో సందడి నెలకొంటే.. కర్ణాటక రాష్ట్రంలో ఎద్దుల బండి జాతర మొదలైంది. ఘడిన్ నాడులోని చామరాజనగర్ జిల్లాలో సంక్రాంతి సమీపిస్తున్న వేళ జాతర మొదలయింది. 

1 / 7
 కస్తూర్ బండి జాతర..  ఇది 16 గ్రామాల నుండి అలంకరించబడిన బండ్లు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో పూర్వనుంచి వస్తున్న ఆచారం ప్రకారం బండ్లు.. ఆధునికతకు గుర్తుగా కార్లు ఉన్నాయి. వధువుల వలె అలంకరించబడిన ఎద్దుల బండ్లు  ఆకర్షణీయంగా సందర్శకులను అలరించాయి. 

2 / 7
ఈ ఎద్దుల బండి ఉత్సవం 23 గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకు గ్రామస్తులు తమ బంధువులందరినీ ఆహ్వానిస్తారు. కరోనా వైరస్ వెలుగు లోకి వచ్చిన తర్వాత.. ఈ జాతరపై నిబంధనలుండగా.. మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కలిసి జాతరలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. 

3 / 7
ఆలయానికి సమీపంలోని ఉన్న సరస్సు నుంచి మట్టిని తీసి శరీరంపై ఉన్న గాయానికి రాసుకుంటే త్వరగా మానుతుందని భక్తుల విశ్వాసం. ఈసారి జనవరి 1న కొత్త సంవత్సరం, జాతర రెండూ ఒకేసారి అత్యంత ఘనంగా జరుపుకున్నారు గ్రామస్థులు 

4 / 7
జాతరలో కస్తూర్, మరియాల, భోగాపూర్, కెళంపల్లి, తోరవల్లితో పాటు పదహారు గ్రామాల నుంచి బండ్లను అందంగా అలంకరించి తీసుకొచ్చారు. అత్యంత ఘనంగా నిర్వహించారు. తమ పశువులకు రోగాలు రాకూడదని కోరుకుంటూ రైతులు తమ బండ్లపై కొబ్బరి కాయలు కొడతారు. ఉచితంగా ఆహారాన్ని అందిస్తారు. 

5 / 7

ఎద్దుల బండ్లను రంగురంగుల వస్త్రాలు, వివిధ రకాల పూలు, అరటిపళ్లు, ఇతర పూలతో అలంకరించారు. ఈ జాతరలో వేలాది మంది ప్రజలు కోలాహలంగా సందడి చేశారు. దొడ్డమ్మతయ్య జాతరలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని  ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని ఆలయ అర్చకులు చెప్పారు. 

6 / 7
జిల్లాలో మొదటి జాతర చామరాజనగర్ తాలూకా కస్తూర్ బండ్ల జాతర.. కస్తూర్ పరిసర ప్రాంతాల్లోని 23 గ్రామాల్లో ఆదివారం జాతర ఘనంగా జరిగింది. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ బండ్లు, ఎద్దుల బండ్లు రకరకాలుగా అలంకరించబడ్డాయి.

7 / 7
అలంకరించిన బండ్ల చక్రాలకు కొబ్బరికాయలను పగలగొట్టారు. అవును జనవరి ప్రారంభం కాగానే సరిహద్దు ప్రాంతమైన చామరాజనగర్ జిల్లాలో జాతరల సందడి మొదలవుతుంది.