శ్రావణ మాసంలో ఈ మొక్కలను ఇంట్లో నాటండి.. శివయ్య ఆశీస్సులతో ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

Updated on: Jul 01, 2025 | 10:43 AM

హిందూ మతంలో శ్రావణ మాసం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో తీసుకునే చిన్న చర్యలు కూడా మహాదేవుడిని సంతోషపెట్టగలవు. జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తాయి. మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని మొక్కలను నాటడం అత్యంత పవిత్రమైన కార్యక్రమం. ఇలామొక్కలు నాటడం వలన శివుడి ఆశీర్వాదం లభిస్తుందని... ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉందని నమ్మకం. ఈ రోజు శ్రావణ మాసంలో నాటాల్సిన మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 6
శ్రావణ మాసం అంటే పూజల మాసం, శివ పార్వతులకు, మహాలక్ష్మి పూజకు విశిష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు వివిధ చర్యలు తీసుకోవడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల శివుని ఆశీర్వాదం మాత్రమే కాదు ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంపద కూడా లభిస్తాయని నమ్ముతారు. జూలై 11వ తేదీ 2025 నుంచి ప్రారంభమయ్యే పవిత్ర శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మొక్కలను ఇంట్లో లేదా వీధిలో నాటడం ద్వారా ప్రత్యేక ఫలాలను ఇచ్చే 5 పవిత్ర మొక్కల గురించి తెలుసుకుందాం.

శ్రావణ మాసం అంటే పూజల మాసం, శివ పార్వతులకు, మహాలక్ష్మి పూజకు విశిష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు వివిధ చర్యలు తీసుకోవడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల శివుని ఆశీర్వాదం మాత్రమే కాదు ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంపద కూడా లభిస్తాయని నమ్ముతారు. జూలై 11వ తేదీ 2025 నుంచి ప్రారంభమయ్యే పవిత్ర శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మొక్కలను ఇంట్లో లేదా వీధిలో నాటడం ద్వారా ప్రత్యేక ఫలాలను ఇచ్చే 5 పవిత్ర మొక్కల గురించి తెలుసుకుందాం.

2 / 6
బిల్వ పత్రాలు 
శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. మహాదేవుడికి మారేడు పత్రాలను సమర్పించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇంట్లో మారేడు మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో దీన్ని నాటడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మారేడు మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

బిల్వ పత్రాలు శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. మహాదేవుడికి మారేడు పత్రాలను సమర్పించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇంట్లో మారేడు మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో దీన్ని నాటడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మారేడు మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

3 / 6

ఉమ్మెత్త మొక్క 
శివుడికి ఉమ్మెత్త మొక్క అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలోనే కాదు శివుడి పూజలో ఉమ్మెత్తని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మీరు మీ ఇంట్లో ఉమ్మెత్త  మొక్కను నాటితే, అది శివుని ప్రత్యేక కృపకు చిహ్నంగా

ఉమ్మెత్త మొక్క శివుడికి ఉమ్మెత్త మొక్క అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలోనే కాదు శివుడి పూజలో ఉమ్మెత్తని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మీరు మీ ఇంట్లో ఉమ్మెత్త మొక్కను నాటితే, అది శివుని ప్రత్యేక కృపకు చిహ్నంగా

4 / 6
తులసి మొక్క
తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా.. విష్ణు ప్రియగా భావిస్తారు. అయితే తులసి దళాలు శివుడి పూజకు ఉపయోగించడం నిషేధం. అయితే శ్రావణ మాసంలో తులసి పూజకి విశేషమైన స్థానం ఉంది. ఇంట్లో తులసి మొక్క ఉండటం సానుకూలతను తెస్తుంది. సంపదకు మార్గం తెరుస్తుంది. శ్రావణమాసంలో ఇంట్లో తులసిని నాటడం, తులసి మొక్కను రోజూ క్రమం  తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కొనసాగుతుంది.

తులసి మొక్క తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా.. విష్ణు ప్రియగా భావిస్తారు. అయితే తులసి దళాలు శివుడి పూజకు ఉపయోగించడం నిషేధం. అయితే శ్రావణ మాసంలో తులసి పూజకి విశేషమైన స్థానం ఉంది. ఇంట్లో తులసి మొక్క ఉండటం సానుకూలతను తెస్తుంది. సంపదకు మార్గం తెరుస్తుంది. శ్రావణమాసంలో ఇంట్లో తులసిని నాటడం, తులసి మొక్కను రోజూ క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కొనసాగుతుంది.

5 / 6
జమ్మి మొక్క 
శమీ మొక్క అంటే జమ్మి మొక్క శివుడు, శనీశ్వరుడి ఇద్దరికీ ఇష్టమైన మొక్క. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో శాంతి, ఆనందం కొనసాగుతాయి. శ్రావణ మాసంలో జమ్మి మొక్కను నాటడం ద్వారా శివుడితో పాటు శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. దీంతో ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగిపోయి... ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.

జమ్మి మొక్క శమీ మొక్క అంటే జమ్మి మొక్క శివుడు, శనీశ్వరుడి ఇద్దరికీ ఇష్టమైన మొక్క. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో శాంతి, ఆనందం కొనసాగుతాయి. శ్రావణ మాసంలో జమ్మి మొక్కను నాటడం ద్వారా శివుడితో పాటు శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. దీంతో ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగిపోయి... ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.

6 / 6
జిల్లేడు మొక్క 
జిల్లేడు పువ్వులు కూడా శివుడికి చాలా ప్రియమైనది, ముఖ్యంగా తెల్ల జిల్లేడు పువ్వుల మొక్కను శ్రావణ మాసంలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా, శివుని ఆశీస్సులు ఉంటాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. జిల్లీడు ఆకులు, జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం వలన మహాదేవుడు సంతోషిస్తాడు. కోరికలు నెరవేరుతాయి.

జిల్లేడు మొక్క జిల్లేడు పువ్వులు కూడా శివుడికి చాలా ప్రియమైనది, ముఖ్యంగా తెల్ల జిల్లేడు పువ్వుల మొక్కను శ్రావణ మాసంలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా, శివుని ఆశీస్సులు ఉంటాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. జిల్లీడు ఆకులు, జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం వలన మహాదేవుడు సంతోషిస్తాడు. కోరికలు నెరవేరుతాయి.