
చాలా మంది శకునాలను నమ్ముతారు. పిల్లి బయటకు వెళ్తున్న సమయంలో ఎదురు అయితే అది అశుభ సంకేతం అని, నెమలి పురి విప్పి నృత్యం చేస్తే అది అదృష్టానికి సంకేతమని నమ్ముతారు. అదేవిధంగా హిందూ మత విశ్వాసాల ప్రకారం పాములు కూడా శుభ, అశుభ చిహ్నాలను సూచిస్తాయి. కనుక పాము కుడి నుంచి ఎడమకు లేదా ఎడమ నుంచి కుడికి వెళ్తుంటే దాని అర్థం ఏమిటో అర్థం చేసుకుందాం.

పాము కుడి నుంచి ఎడమకు రోడ్డు దాటితే: మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణిస్తున్న సమయంలో కుడి నుంచి ఎడమకు పాము రోడ్డు దాటుతున్నట్లు మీరు చూస్తే..మీరు చేయబోయే పనిలో విజయం సాధిస్తారు. మీరు డబ్బు కోసం ప్రయాణిస్తుంటే.. మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

మీ ఎడమ వైపు నుంచి రోడ్డు దాటుతున్న పాములు చూస్తే: మీరు రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎడమ వైపు నుంచి రోడ్డు దాటుతున్న పాముని చూస్తే.. అది శుభ శకునం కాదు. ఆ రోజు మీరు ఏమి చేసినా లేదా ఎక్కడికి వెళ్ళినా చేయాలనుకున్న పని సక్సెస్ కాదు. అంటే పనిలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటారు.

చెట్టు ఎక్కుతున్న పాము కనిపిస్తే: చెట్టు ఎక్కుతున్న పాము కనిపిస్తే.. అది శుభ సంకేతం. మీ పురోగతికి మార్గం తెరుచుకోబోతోందని అర్థం. పాము చెట్టు ఎక్కడం కనిపిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకం.

తెల్ల పామును చూసినట్లయితే: సాధారణంగా తెల్ల పాములు కనిపించడం చాలా అరుదు. అయితే ఒకవేళ తెల్ల పాములను చూసినట్లయితే.. అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అంటే మీరు వెళ్తున్న పనిలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

ఇంట్లో రెండు తలల పాము కనిపిస్తే: ఇంట్లో లేదా ఎక్కడైనా రెండు తలల పాము కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి పాము లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఈ పాములు విషపూరితమైనవి కావు, కనుక వాటిని ఇబ్బంది పెట్టవద్దు. లేదా చంపవద్దు.

ఇంట్లో లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చనిపోయిన పాముని చూస్తే: చనిపోయిన పాము కనిపిస్తే అది చెడుకి సంకేతం అని.. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పాము చనిపోయి కనిపిస్తే అది అశుభానికి సంకేతం అని అంటారు. అటువంటి పరిస్థితిలో అశుభ ప్రభావాలను నివారించడానికి శివుడికి జలాభిషేకం చేయడం మంచిది.