Lucky Zodiac Signs: అరుదైన పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు..!

Edited By:

Updated on: Jun 22, 2026 | 1:20 PM

Moon - Mercury Parivartan Yoga: జూన్ 23–24 తేదీల్లో చంద్రుడు–బుధుడి మధ్య అరుదైన పరివర్తన యోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ కాలంలో శుభవార్తలు, ఆర్థిక లాభాలు, గృహ సంబంధిత ఒప్పందాలు అనుకూలించే అవకాశాలతో పాటు పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లలో కూడా అనుకూల ఫలితాలు లభించవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

1 / 7
బుద్ధి కారకుడైన బుధుడు, మనసుకు కారకుడైన చంద్రుడికి మధ్య ఈ నెల(జూన్) 23, 24 తేదీల్లో పరివర్తన జరుగుతోంది. కర్కాటకంలో ఉన్న బుధుడికి, కన్యలో ఉన్న చంద్రుడికి మధ్య ఈ పరివర్తన చోటు చేసుకుంటోంది. తండ్రీ కుమారులైన చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం కొన్ని రాశులకు ఊహించని అదృష్టాలను తెచ్చి పెడుతుంది. శుభవార్తలు, సానుకూల సందేశాలు అందుకోవడం ఎక్కువగా జరుగుతుంది. గృహ, ఆర్థిక ఒప్పందాలకు సమయం బాగా అనుకూ లంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి.

2 / 7
వృషభం: ఈ రాశికి తృతీయ, పంచమాధిపతులైన చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. జీతభత్యాలు, రాబడి బాగా పెరుగుతాయి.

3 / 7
మిథునం: ఈ రాశికి ధన, చతుర్థాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల శుభ వార్తలు, సానుకూల సమా చారాలు ఎక్కువగా అందడం జరుగుతుంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

4 / 7
కన్య: రాశ్యధిపతి బుధుడికి, లాభాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అన్ని రంగాల్లోనూ అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. షేర్ల పెట్టుబడులు బాగా లాభిస్తాయి.

6 / 7
మకరం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. తప్పకుండా మహా భాగ్యయోగం పడుతుంది. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి.

7 / 7
మీనం: ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల  రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. వృక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

Follow Us