
మిథునం: ఈ రాశికి ఈ మాలికా యోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది.

సింహం: ఈ రాశిలో మాలికా యోగం చోటు చేసుకుంటున్నందు వల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాలలో వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశివారికి ఈ మాలికా యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. ఆదాయం దినదినాభివృద్ది చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాన్యులు సైతం సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది. విదేశీయాన సూచనలున్నాయి.

తుల: ఈ రాశివారికి మాలికా యోగం వల్ల సామాజికంగా పలుకుబడి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా కలిసి వచ్చి సంపన్నులు కావడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం, లాభాలు పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల అంచనాలకు మించి లాభాలు కలిగే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానం నుంచి మాలికా యోగం కలిగినందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానం నుంచి మాలికా యోగం పట్టడం వల్ల ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)