
ఫిబ్రవరి 17న మొదటి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది భారత దేశంలో కనిపించదు కాబట్టి, నూతక కాలం చెల్లదు. ఇక ఈ సూర్య గ్రహణం మధ్యాహ్నం 3: 26 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 7.57 గంటలకు ముగుస్తుంది. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యుడు అగ్రి వలయంలా కనిపిస్తాడు. అయితే భారత దేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినప్పటికీ, కొన్ని రాశుల వారికి అడుగడుగునా సమస్యలే తీసుకురానున్నాడు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

సింహ రాశి : సింహ రాశి వారు గ్రహణం సమయంలో చాలా సహనంగా ఉండాలి. అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది మాట్లాడినా, అది మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. కానీ ఓపికగా ఉంటే పనులు పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధపెడుతాయి. విద్యార్థులకు ఇది చాలా కష్టకాల సమయం.

కుంభ రాశి : కుంభ రాశి వారు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అహంకారం, గొప్పలకు వెళ్లడం వలన ఇబ్బందుల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పని చేసే చోట ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుటుంబంలో కలహాల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తలు అవసరం. అలాగే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, అంత మంచిది. లేకపోతే సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది.