
కుజుడు మిథున రాశిలో ఒంటరిగా ఉండటం వలన ఇది నాలుగు గ్రహాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువలన కొంత మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసర వాదనలకు దిగడం అస్సలే మంచిది కాదంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా కష్టకాల సమయం. చేయని పనులకు నిందలు పడాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు వీలైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఊహించని చిక్కుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.

కుంభ రాశి : వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. అనారోగ్యం కూడా క్షీణిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి చాలా వరకు సమస్యలనే తీసుకొస్తాయి. అందువలన ఈ రాశి వారు వీలైనంత వరకు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదాయం ఉన్నా కూడా అదృష్టం కలిసి రాదు. వీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తాయి. అలాగే మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కుంటారు. అందువలన వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మకర రాశి : మకర రాశి వారికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు అని చెబుతున్నారు నిపుణులు.