
జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక యోగాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని విశ్వసిస్తారు. గజకేసరి రాజయోగం, త్రిగ్రహ రాజయోగం, లక్ష్మీనారాయణ యోగంతో పాటు పారిజాత యోగం కూడా అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఈ ఏడాది మే 13న వచ్చే అపర ఏకాదశి సందర్భంగా అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది.

ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, ప్రత్యేక పూజలు చేస్తే మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఏర్పడుతున్న పారిజాత యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనున్నప్పటికీ, కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశి.. పారిజాత యోగం ప్రభావంతో తులా రాశివారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వివాహ యత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ, గౌరవం మరింత పెరుగుతుంది.

మిథున రాశి.. మిథున రాశివారికి ఈ యోగం వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతిని తీసుకురానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. మీరు ఆశించిన దానికంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మీ మాటతీరు, నిర్ణయ సామర్థ్యం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశివారికి పారిజాత యోగం శుభ ఫలితాలను అందించనుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రభావం పెరిగే సమయం ఇది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)