
హోలీ రోజున శక్తివంతమైన ఐదు యోగాలు ఏర్పడనున్నాయి. వాటిలో ముఖ్యంగా మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రదిత్య రాజయోగం , లక్ష్మీ నారాయణ రాజయోగం, ధన శక్తి యోగం, దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి రానున్నది. కాగా, ఇది ఏ రాశుల వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి హోలీ పండుగ ఆనందాన్ని తీసుకొస్తుంది. వీరికి ఈ పండుగ రోజు ఏర్పడే ఐదు యోగాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశి వారికి శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వలన సంపద పెరుగుతుంది. అంతే కాకుండా వీరు స్థిరాస్తి లేదా, కొత్త వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి నాలుగు రాజయోగాల వలన అద్భుతమై ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరగా ఉద్యోగం లభిస్తుంది. ధన యోగం కలుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

సింహ రాశి :ఈ రాశిలో జన్మించిన వారికి ఐదు రాజయోగాలు ఏర్పడటం అదృష్టాన్ని ఇస్తుంది. వీరి రాశి సూర్యునిచే పాలించడం వలన వీరికి బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగం వలన వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆదాయం వచ్చి చేరుతుండటంతో చాలా ఆనందంగా గడుపుతారు

తుల రాశి : తుల రాశి వారికి హోలీ పండుగతో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంది. అలాగే ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది