
అక్టోబర్ నెలలో శక్తివంతమైన గ్రహాలు అయిన కుజ గ్రహం, గురు గ్రహం ప్రత్యేక సంయోగంతో నీచ భంగ రాజయోగం ఏర్పరుస్తాయి. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరిస్తే మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు తీసుకొస్తుంది. కాగా, ఇప్పుడు మనం దీని వలన ఏ రాశి వారికి లాభాలు చేకూరుతాయో చూసేద్దాం.

కుజగ్రహం, గురు గ్రహం ఈ రెండు గ్రహాలు కర్కాటకంలో కలయికలు జరిపి, సంయోగం చెందనున్నాయి. కుజుడు నవంబర్ 12 వరకు కర్కాటక రాశిలోనే ఉండగా, గురుడు అక్టోబర్ 31వరకు అదే రాశిలో ఉంటాడు. అయితే ఈ రాశిలో గురుడు ఉచ్ఛస్థితిలో, కుజుడు నీచ స్థితిలో సంచారం చేస్తుంటాయి. దీని వలన నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశుల వారికి లాభాలను తీసుకొస్తుంది.

కుంభ రాశి : విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు సంతోషంగా ఉండటం వల్ల శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తేలికపాటి వ్యాయామాలు చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి.

మకర రాశి :ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే అవుతుంది. సెప్టెంబర్ లో ఉన్న ఆటంకాలు, ఆలస్యాలు అన్నీ అక్టోబర్ లో తొలగిపోతాయి. శని మీ రాశికి బలంగా ఉండటం వల్ల మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి.

వృషభ రాశి : ఈ నెలలో ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. గత నెలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకోని ధన లాభం, స్థలం లేదా ఆస్తి ద్వారా లాభం కలిసి వచ్చే సూచన. పాత అప్పులు తీరిపోతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి, ప్రేమ పెరుగుతుంది.