Career Astrology: నవంబర్‌ నెలలో ఈ 5 రాశులకు కెరీర్‌లో భారీ పురోగతి..!

Updated on: Oct 30, 2026 | 7:01 PM

నవంబర్ 2026లో గ్రహాల సంచారంలో చోటుచేసుకునే కీలక మార్పులు ఐదు రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి ఈ నెలలో కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. గ్రహ మార్పులు ఏయే రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇస్తాయో ఇక్కడ చూద్దాం..

1 / 5
మేష రాశి: ఈ రాశి వారికి నవంబర్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేందుకు అనుకూల సమయం. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

2 / 5
మిథున రాశి: ఈ రాశి వారికి నవంబర్ రెండో భాగం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రచన, మీడియా, మార్కెటింగ్, కళారంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారులకు కొత్త కస్టమర్లను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తమ పనిని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్తారు.

3 / 5
సింహ రాశి: ఈ రాశి వారికి నవంబర్ నెల ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశిలో గురు, కుజ గ్రహాల సంచారం జ్యోతిష్యపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగంలో ఎదగాలని ప్రయత్నిస్తున్న వారికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు కొత్త ప్రణాళికలను అమలు చేసేందుకు ముందడుగు వేస్తారు. విద్య, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.

4 / 5
తుల రాశి: ఈ రాశి వారికి నవంబర్ చివరి భాగం కీలకంగా మారుతుంది. నవంబర్ 22న శుక్రుడు స్వరాశి అయిన తులలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఉద్యోగులు కొత్త పరిచయాలు పెంచుకోవడంతో పాటు తమ అభిప్రాయాలను ఉన్నతాధికారులకు సమర్థవంతంగా వివరిస్తారు. వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఆర్థిక విషయాల్లో పొదుపు, బడ్జెట్‌పై దృష్టి పెట్టడం మంచిది. ప్రేమ జీవితంలోనూ భాగస్వామితో అనుబంధం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

5 / 5
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి నవంబర్‌లో గురు గ్రహ స్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత చదువులు, భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కొత్త దిశ లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి కోరుకునేవారు కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్త పరిచయాలు పెంచుకుని వ్యాపార విస్తరణకు ప్రయత్నించాలి. అనుభవజ్ఞుల సలహాలు కూడా ఉపయోగపడుతాయి. (గమనిక: ఇవి జ్యోతిష్య నమ్మకాలు, గ్రహ సంచారాల ఆధారంగా చెప్పిన అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు)

Loading...
Unable to load recommendations.
Follow Us