మైసూర్ ప్యాలెస్‌లో మొదలైన దసరా ఉత్సవాలు.. రాజ వేషంలో ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్

|

Oct 03, 2024 | 8:56 PM

దసరా పండగ సందడి కర్ణాటకలో ఓ రేంజ్ లో సాగుతోంది. ఆ రాష్ట్ర పండుగ దసరా నవరాత్రి ఉత్సవాలకు.. ముఖ్యంగా మైసూరు దసరా ఉత్సవాలకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అంతటి విశేషమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభం అయ్యాయి. రాజ వేషధారణలో మెరిసిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ దసరా మహోత్సవాలను 2024ను ప్రారంభించారు. మైసూర్ ప్యాలెస్‌లో దసరా రంగులు అద్దుకున్నాయి. ఇక్కడ ఉన్న ప్రైవేట్ కోర్టులో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ వేషధారణలో మెరిసిపోతూ కనిపించారు. సింహాసన దర్బార్ ని కూడా నిర్వహించారు.

1 / 7
రాజాధిరాజ రాజా మార్తాండ రాజా కులతిలక యదువీర్ పరాక్.. బహు పరాక్.. బహు పరాక్.. వంధి మగధరుడు బహుపరాక్ అంటూ సినిమాలో వినిపించే ఈ వెల్కం దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ ప్యాలేజ్ లో వినిపించాయి. యదువంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ ఠీవితో దర్భార్ కోసం హాల్ కి చేరుకున్నారు. ఈ రోజు నవరాత్రులలో మొదటి రోజు సందర్భంగా మైసూరులో ప్రైవేట్ దర్బార్ ని నిర్వహించారు.

2 / 7

మైసూరు ప్యాలెస్‌లో నేటి నుంచి దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. గతంలో రాజులు నిర్వహించే దర్బార్ల తరహాలోనే దసరా సందర్భంగా ప్రైవేట్ దర్బార్లు నిర్వహించడం ఆనవాయితీ. దీని ప్రకారం ఈసారి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ప్రైవేట్ దర్బార్ నిర్వహించారు

3 / 7
యదువీర్ రాజు వేషధారణలో దర్బార్ హాలులోకి ప్రవేశించగానే వంధి మగధరుడు బహు పరాక్ అని గొంతెత్తి పలుకుతూ స్వాగతం పలికారు. యదువీర్ సింహాసనం దగ్గరకు వెళ్లి సింహాసనానికి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి అనంతరం సింహాసనానికి పూజలు చేసి మంగళారతి నిర్వహించారు. అనంతరం సింహాసనం పక్కనే కూర్చొని నవగ్రహ పూజతోపాటు పలు పూజలు నిర్వహించారు.

4 / 7
దీని తరువాత యదువీర్ సింహాసనాన్ని అధిరోహించారు. అదే సమయంలో అతని భార్య త్రిషికాకుమారి యదువీర పాదపూజ చేశారు. భార్య తర్వాత దివానులు సింహాసనం ముందు నిలబడి నమస్కరించారు. అనంతరం రాజభవన ఆలయాలు, చాముండిబెట్ట, ఉత్తనహళ్లి బెట్ట సహా పలు ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడయార్‌కు అందజేశారు. యదువీర్ భక్తితో అన్ని ప్రసాదాలను స్వీకరించారు.

5 / 7

అనంతరం మైసూర్ రాష్ట్ర గీతం ఆలపించారు. ఈ సమయంలో యదువీర్ రత్నాల సింహాసనంపై దగ్గర నిలబడి జాతీయ గీతానికి వందనం చేసి నివాళులర్పించారు. రాష్ట్ర గీతాలాపన పూర్తయిన తర్వాత సింహాసనం నుంచి దిగి ప్రైవేట్ దర్బను ముగించారు.

6 / 7
యదువీర్ ప్రైవేట్ దర్బార్ నిర్వహించడానికి ముందు తెల్లవారుజాము నుంచి ప్యాలెస్‌లో పూజలు నిర్వహించారు. మంగళ స్నానం చేసి చాముండేశ్వరికి పూజలు చేసిన అనంతరం యదువీర్ కంకణం ధరింపజేశారు. ఈ సమయంలో రాజభవనంలోని కోడి సోమేశ్వరాలయం నుంచి ఏనుగు, ఆవు, గుర్రంతో వచ్చిన వాటిని తీసుకుని దర్భార్ లో ముందుకు సాగారు.

7 / 7
సుమారు 1 గంట పాటు మైసూరు ప్యాలెస్‌లో గత వైభవాన్ని మళ్ళీ కనుల ముందుకు తీసుకుని వచ్చినట్లు అయింది. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ప్యాలెస్‌లోకి ప్రజలు ప్రవేశించకుండా నిషేధించారు. మొత్తానికి మైసూర్ ప్యాలెస్ లో నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా దసరా దర్బార్ మొదలైంది.