
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులు లేదా నక్షత్రాలు మార్చుతుంటాయి. కొన్ని గ్రహాలు ప్రతి నెల తమ రాశి లేదా నక్షత్రాన్ని మార్చుకుంటే మరికొన్ని గ్రహాలు సంవత్సరం, ఆరు నెలలకు ఒకసారి రాశి, నక్షత్రాన్ని మార్చుతుంటాయి. అయితే ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి లేదా ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి సంచారం చేసినప్పడు 12 రాశులపై దీని ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగుతే, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి.

అయితే జూన్ 4న చంద్రుడు తన రాశి సంచారం చేయనున్నాడు. అంటే ఈ రోజు చంద్రడు తుల రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయడం జరిగింది. అయితే ఇది మూడు రాశుల వారికి అద్భతమైన లాభాలను తీసుకొస్తుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుందంట. మరి అందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

మేష రాశి : మకర రాశిలోకి చంద్రుడి సంచారం వలన మేష రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. పెట్టు పెడులు ఆశించిన లాభాలను తీసుకొస్తాయి.

తుల రాశి : తుల రాశి వారికి మకర రాశిలోకి చంద్రుడు సంచారం చేయడం వలన పట్టింది బంగారమే అవుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. ఊహించని విధంగా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. విద్యార్థులు పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి :మీన రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా తీర్థయాత్రలు చేస్తారు.