December 2026 Horoscope: డిసెంబర్ నెలలో వీరికి తిరుగులేని అదృష్టం..! ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్!

Edited By:

Updated on: Nov 28, 2026 | 1:19 PM

మాస ఫలాలు (డిసెంబర్ 1-31, 2026): మేష రాశి వారికి ఈ నెలలో ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం వంటివి జరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ నెలంతా కొనసాగుతున్నందువల్ల ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయి. మిథున రాశి వారికి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా నెల రోజులపాటు జీవితం గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు వైభవంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి డిసెంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడితో పాటు, గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధన స్థానాధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. తలపెట్టిన వ్యవహారాలు, పెండింగ్ పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం తగ్గిపోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్య మైన సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఆఫర్లు అందు కుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో ఈ నెలంతా కొనసాగుతున్నందువల్ల ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు లాభిస్తాయి. అధికారులకు మీ అవసరం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో, రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా నెల రోజులపాటు జీవితం గడిచిపోతుంది. శుక్ర, గురు, కుజుల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు వైభవంగా సాగిపోతాయి. ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురో గమిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. విలాస జీవితం అలవడు తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు చదువుల్లోబాగా వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ధన, పంచమాధిపతులైన రవి, కుజుల మధ్య డిసెంబర్ 16 వరకు పరివర్తన కొనసాగడం, సప్తమ  స్థానంలోకి రాహువు ప్రవేశించడం వల్ల ఈ నెలంతో విజయాలు, సాఫల్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పని భారం గానీ, బరువు బాధ్యతలు గానీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి ఈ నెల 16 వరకు కుజుడితోనూ, ఆ తర్వాత గురువుతోనూ పరివర్తన చెందడం వల్ల నెల రోజుల పాటు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఈ రాశిలో గురు, కుజులు యుతి చెందడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని ప్రధాన సమస్యలు, ఒత్తిళ్లు తొలగి పోయి మనశ్శాంతి లభిస్తుంది. బుధ, శుక్రుల అనుకూలత వల్ల  ఆర్థిక వ్యవహారాల్లో ముంద డుగు వేస్తారు. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించడం, రాహువు పంచమ స్థానంలో సంచారం చేయడం, గురు, కుజులు వ్యయ స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు ఆటంకాలు ఏర్పడ తాయి. ధన స్థానంలో శుక్ర బలం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలో చనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెద్దల సలహాలతో వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కొంత మేరకు పరిష్కరించుకుంటారు. బంధువులు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తుండడం, బుధుడు ధన స్థానంలో, గురు, కుజులు లాభ స్థానంలో యుతి చెందడం నెలంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. వ్యక్తిగత జీవి తంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవం తంగా నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశలు వదులుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు లాభసా టిగా, నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. అవస రానికి మించి చేతిలో డబ్బుండే అవకాశం ఉంది. ప్రముఖులతోమంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): డిసెంబర్ నెలంతా రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో గురువుతో కలిసి ఉండడం, తృతీయ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా కుటుంబపరంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యయస్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలిచి ఉండే అవకాశం ఉండదు. విలాస జీవితం గడుపుతారు. ఏ పనైనా శ్రమ, తిప్పటతో గానీ పూర్తయ్యే అవకాశం ఉండదు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్త అందు తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సాగిపోతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలో కుజుడితో యుతి చెందడం, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి, గౌరవ మర్యాదలకు లోటుండదు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మీ ఆలోచలు, మీ నిర్ణయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూ లంగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగు తుంది. కొందరు మిత్రులకు సాయం చేస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలి స్తాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): లాభ స్థానంలో రవి, బుధులు, దశమ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. గురువు అనుకూలంగా లేనందు వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయిపోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విలాసాల మీద బాగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యో గంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనేక మార్గా  లలో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని ప్రభావం వల్ల, వ్యయ స్థానంలో రాహువు ప్రవేశించడం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు సన్నిహితులు స్వార్థానికి మీ సేవలను ఉపయోగించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉండడం, పిల్లలు వృద్ధిలోకి రావడం వంటివి చాలావరకు మనశ్శాంతినిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యో గంలో స్థిరపడే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం అవసరం. విద్యా ర్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు గట్టిగా ప్రయత్నించడం మంచిది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉండడం వల్ల ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటేఅంత మంచిది. మోసపోవడానికి, నష్టపోవడానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. రవి, బుద, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి, వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలకు ఇబ్బంది ఉండదు. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉన్నందువల్ల పట్టుదలగా ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. వృత్తి జీవితం బిజీగా సాగు తుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.

Loading...
Unable to load recommendations.
Follow Us