
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్కకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరి ఇంటిలోనైతే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారికి ఆర్థికంగా , వాస్తు పరంగా కలిసి వస్తుందని చెబుతుంటారు నిపుణులు. ముఖ్యంగా ఇది సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటిలో సంపద పెరుగుతుంది అంటారు.

అయితే కొంతమంది మనీ ప్లాంట్ మొక్కను దొంగతనంగా ఇంటికి తెచ్చుకుంటారు. మరి ఇలా దొంగిలించిన మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా అంటే? వాస్తు పండితులు ఏం చెబుతున్నారంటే? దొంగిలించిన వస్తువులు అశుభకరం అని ఎక్కడా చెప్పలేదు. ముఖ్యంగా మనీ ప్లాంట్ విషయంలో కూడా అంతే , కానీ మనీ ప్లాంట్ దొంగలించడం మంచిది కాదు అంటారు. చాలా మంది మనీ ప్లాంట్ దొంగలించి ఇంటిలో నాటుకుంటే సంపద పెరుగుతుంది అంటారు.

కానీ ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మంది మనీ ప్లాంట్ దొంగతనం చేసి తెచ్చుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతాయంట. అందువలన వాటిని దొంగతనం చేయకుండా స్నేహితుల నుంచి అడిగి తీసుకోవడం లేదా నర్సరీ నుంచి కొనుగోలు చేయడం చాలా మంచిదంట.

అలాగే కొంత మంది మనీ ప్లాంట్ బహుమతిగా ఇస్తారు ఇలా చేయడ కూడా మంచిది కాదంట, దీని వలన అదృష్టం, సంపద పోతుందంట. అందుకే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్‌ను బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ సంతోషాన్ని తీసుకొస్తుంది, ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది.

అందుకే దీని విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలి . అప్పుడే ఇంట్లో సంపద పెరగడమే కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు