
మేష రాశి : మేష రాశి వారు చాలా మంచి వారు. అయితే వీరికి ధైర్యం ఎంత ఎక్కువగా ఉంటుందో, అలాగే వీరికి తొందరపాటు తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అయినా కష్టంలో ఉన్నారు అంటే చాలా త్వరగా డబ్బు ఇచ్చేస్తుంటారు. అందువలన వీరు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు.

సింహ రాశి : సింహ రాశి వారు చాలా మొండి పట్టు కలవారు. కానీ ఎవరు అయినా డబ్బు అడిగితే సులభంగా కరిగిపోయి డబ్బు ఇస్తుంటారు. వీరిది అగ్నితత్వం గల రాశి అందువలన చాలా వరకు వీరు డబ్బు ఇవ్వకూడదు. ఎందుకు అంటే? సింహ రాశి వారికి పరువు, మాట అంటే ప్రాణం. ఎవరైనా ప్రేమగా అడిగితే ఎంత పెద్ద మొత్తమైనా ఇచ్చేస్తారు. వీరు ఇచ్చిన అప్పు తిరిగి అడగరు, అడిగితే తమ పరువు పోతుందని భావిస్తారు. అందుకే వీరి దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలవదు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఎంత దగ్గరి వారు అయినా సరే చేతికి డబ్బు ఇవ్వకూడదు. చాలా వరకు వీరు అడగగానే డబ్బు ఇస్తారు. ధనస్సు రాశి వారికి దాన గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పు అని కాకుండా సహాయం అని భావించి ఇస్తారు. లెక్కలు రాసుకోరు, సాక్ష్యం ఉంచుకోరు. అందుకే వీరు ఇచ్చిన డబ్బుకు లెక్కే ఉండదు. జాతకంలో గురు బలం తక్కువగా ఉన్నప్పుడు ఇస్తే ఆ డబ్బు అసలు తిరిగి రాదు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్. కుటుంబం, బంధువులు, స్నేహితులు అడిగితే కాదనలేరు. అప్పు ఇచ్చిన తర్వాత వారి వెనుక తిరగలేక, మనసులోనే బాధపడుతూ ఉంటారు. వీరి మంచి మనసే వీరికి శత్రువు అవుతుంది, డబ్బుతో పాటు మనుషులను కూడా దూరం చేస్తుంది. అందుకే వీరికి ఎవరికీ కూడా కర్కాటక రాశి వారికి ఇవ్వకూడదు.