
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహా సంచారం సహజం. ప్రతి నెల కొన్ని రాశులు తమ రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకుంటాయి. అయితే నవంబర్ మొదటి వారంలో కర్కాటక రాశిలోకి చంద్రుడు సంచారం చేయనున్నాడు. కానీ ఇప్పటికే అదే రాశిలో కుజుడు ఉండటం వలన కుజుడు, చంద్రుడి కలియక జరగనున్నదంట. దీని వలన నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, అది ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి : మిథున రాశి వారికి దీపావళి పండుగ నుంచి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి కోరిక నెరవేరుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. అప్పుల నుంచి త్వరగా బయటపడతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశికి పట్టింది బంగారమే కానుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. గోల్డ్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. మహాలక్ష్మి అనుగ్రహం వలన ఈ రాశి వారు మంచి ఉద్యోగం సంపాదించునే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది అద్భుతంగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి కూడా ఇది అద్భతమైన సమయం. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశి వారిపైన ఉంటుంది. అందువలన వీరు నూతన వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. ఈ రాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది.