
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

వృషభ రాశి : శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేపట్టినా అది చాలా త్వరగా విజయాన్ని అందుకుంటుంది. సమాజంలో గౌర మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఇది యోగ కాలం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు నూతన గృహానికి ప్లాన్ చేస్తారు. ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు అనుకున్న పనులన్నీ నిజం చేసుకుంటారు. విద్యార్థులకు చాలా బాగుటుంది. పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సాధిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి.

మేష రాశి : మేష రాశి వారికి లక్కు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యలు నిర్వహించుకుంటారు. చాలా ఆనదంగా గడుపుతారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది.