
ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు పన్నెండు రాశులలో ఒక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తు్న్నాయంట. ఈ సమయం వారికి బంగారం లాంటి సమయం అని పండితులు చెబుతున్నారు. కాగా, ఇంతకీ ఆ రాశి ఏది అంటే సింహ రాశి. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

నవరాత్రి ఉత్సవాలు దుర్గామాతకు సంబంధించనవి . దుర్గామాత వాహనం సింహం, అమ్మవారిని సింహ వాహిణి అని కూడా అంటారు. సింహ రాశి వారికి చిహ్నం సింహం. అందుకే ఈ తొమ్మది రోజుల పాటు పన్నెండు రాశులలో సింహ రాశి వారిపైనే అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. నవరాత్రుల సమయంలో సూర్యుడు ఉచ్ఛ స్థితికి దగ్గరగా, బలంగా ఉంటాడు. సూర్యుడు బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం, పదవి, ప్రభుత్వ లాభం, సమాజంలో గౌరవం పెరుగుతాయి. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

అలాగే సింహ రాశి అగ్నితత్వం ఉన్నది. నవరాత్రుల్లో చేసే హోమాలు, దీపారాధన, అగ్నికి సంబంధించిన పూజలు అగ్ని తత్వ రాశి అయిన సింహ రాశి వారికి త్వరగా ఫలిస్తాయి.అందుకే ఈ నవరాత్రుల్లో సింహ రాశి వారు కుంకుమతో అమ్మవారిని పూజించి, దుర్గా చాలీసా చదివితే కోరుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతారు.

ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు