ముక్కోటి ఏకాదశి నాడు అరుదైన యుతి.. ఈ రాశులకు లక్ష్మీ యోగం, కుబేర యోగం!

Edited By:

Updated on: Dec 24, 2025 | 6:21 PM

ఈ నెల(డిసెంబర్) 30న ముక్కోటి ఏకాదశి రోజున విశేషమైన గ్రహాల యుతి జరగబోతోంది. ఆ రోజున నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండి మిథున రాశిలో ఉన్న గురువును వీక్షించబోతున్నాయి. జనవరి 12 వరకూ కొనసాగే ఈ అరుదైన గ్రహ గతి వల్ల కొన్ని రాశులకు లక్ష్మీయోగం, కుబేర యోగం, ధన ధాన్య సమృద్ది యోగం పట్టబోతున్నాయి. మేషం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది. వీరికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ రాశుల వారు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి 15 రోజుల పాటు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అనేక శుభాలు కలిగే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న గురువును ధనూ రాశి నుంచి కుజ, శుక్ర, రవి, బుధులు వీక్షించడం వల్ల ఈ రాశివారికి తిరుగులేని కుబేర యోగం కలిగింది. లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగడం వల్ల ఈ రాశివారు లాటరీ ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభాలనిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. దేనికీ కొరత ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశిలో ఉన్న గురువును సప్తమ స్థానం నుంచి నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశి వారికి ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు తీరుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీ సంపాదన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

3 / 6
సింహం: రాశ్యధిపతి రవితో సహా పంచమ స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు లాభ స్థానంలో ఉన్న గురువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి లక్ష్మీయోగంతో పాటు కుబేర యోగం కూడా కలిగింది. ఈ రాశి వారికి లాటరీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆస్తి పాస్తుల మీద వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి తప్పకుండా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా లాభాలు కలుగుతాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశిలో ఉన్న నాలుగు గ్రహాలు రాశ్యధిపతి గురువును వీక్షించడం వల్ల ధనపరంగా పట్టిందల్లా బంగారమవుతుంది. లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆస్తి పాస్తులు కలిసి రావడం, ఆస్తుల విలువ పెరగడం, సొంత ఇల్లు అమరడం జరిగే అవకాశం ఉంది.

5 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువును లాభ స్థానం నుంచి నాలుగు గ్రహాలు చూడడం వల్ల తప్పకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. లాటరీ ద్వారా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. వారసత్వపు ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

6 / 6
మీనం: చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువును దశమ స్థానం నుంచి నాలుగు గ్రహాలు చూడడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా లక్ష్మీ యోగం పడుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ లాభం కలుగుతుంది. ఆదాయ వృద్దికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లభించి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.