Sankranti Astrology: సంక్రాంతి నుంచి వారికి కలలో కూడా ఊహించని ధన యోగాలు..!

Edited By:

Updated on: Jan 10, 2026 | 4:40 PM

Money Astrology 2026: ఈ నెల(జనవరి) 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. ఈ గ్రహం ఉచ్ఛపడితే తనకు అనుకూలమైన రాశుల వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లకుండా ఉండడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు కలలో కూడా ఊహించని ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత నుంచి ఈ రాశుల వారు ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పకుండా ఫలిస్తుంది.

1 / 5
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి అయిదు వారాల పాటు శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహాఅనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుంది. రావలసిన సొమ్ము చేతికి పూర్తిగా అందడంతో పాటు, పిత్రార్జితం కూడా లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

2 / 5
సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో కుజుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీత భత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

3 / 5
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ఈ రాశికి తృతీయ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు అయిదు వారాల పాటు అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

4 / 5
ధనుస్సు: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడంతో పాటు, ఆస్తుల విలువ పెరుగుతుంది. భూలాభం కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి.

5 / 5
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది. లాటరీ వచ్చే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలగడంతో పాటు పిత్రార్జితం కూడా లభిస్తుంది.