
తుల రాశి : తుల రాశి వారికి కార్తీక పౌర్ణమి అదృష్టాన్ని మోసుకువస్తుంది. శివాలయంలో దీపారాధన చేస్తే, వీరి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్, మెసేజ్ రూపంలో శుభవార్త వస్తుంది. విదేశీ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది. ఆలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే, వీరి కోరిక తప్పక నెరవేరుతుంది. వ్యాపారంలో పెద్ద లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ, దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. భూమి, వాహనం కొనే యోగం ఉంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

కుంభ రాశి : ఈ కార్తీక పౌర్ణమి కుంభ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుస్తుంది. శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే, చాలా రోజులుగా ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది.

సింహ రాశి :సింహ రాశి వారికి శివుడి పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఆలయానికి వెళ్తే, ఉద్యోగంలో ప్రమోషన్ గురించి గుడ్ న్యూస్ వింటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని పై ఎలాంటి ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తిమేరకే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.