
ముఖంలో కనుబొమ్మలు అందాన్ని తీసుకొస్తాయి. ముఖం చూడగానే అవే కనిపిస్తాయి. అయితే కొంత మంది కనుబొమ్మలు వెడల్పుగా చాలా అందంగా కనిపిస్తే, మరికొంత మంది మాత్రం రెండూ కలిసి పోయి కనిపిస్తాయి. అయితే రెండు కనుబొమ్మలు కలిసి ఉంటే రెండు పెళ్లీలు అవుతాయని అంటారు కొందరు. ముఖ్యంగా పెద్దవారు రెండు కనుబొమ్మలు కలిసి ఉండకూడదు అని చెబుతారు.

అయితే పండితులు మాత్రం రెండు కనుబొమ్మలు కలిస్తే , రెండు పెళ్లీలు జరగడం అనేది అపోహ మాత్రమే, దీని పై ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు అని చెబుతున్నారు. ముఖ్యంగా రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న వ్యక్తి ఎక్కువ కష్టపడి పని చేసే తత్వం కలవారు అని వారు చెబుతున్నారు.

అయితే కనుబొమ్మలు కలిసి ఉండటం కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు ఫలితాలను చూపిస్తుంది. కొందరికి ఇది మంచి ఫలితాలను ఇస్తే, కొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది. మతి విశ్వాసాల ప్రకారం అమ్మాయిలకు కనుబొమ్మలు కలిసి ఉండటం అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అలాగే రెండు కనుబొమ్మలు కలిసి ఉన్న అమ్మాయిలు అత్త వారింటిలో సిరుల వర్షం కురిపిస్తారంట.

ఇక పురుషులకు మాత్రం ఇది మంచిది కాదు అని చెబుతున్నారు పండితుల, కనుబొమ్మలు కలిసి ఉన్నవారు తమ జీవితంలో కష్టపడి పని చేసినా అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందంట. చిన్న చిన్న విషయాలకు సమస్యలు ఎదుర్కోవడం, కష్టానికి తగిన ఫలితం లభించకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.