రాత్రికి రాత్రే దొంగలు నిర్మించిన ఆలయం.. దీని చరిత్ర తెలిస్తే అంతా మాయే అంటారు

Updated on: Jul 30, 2026 | 3:40 PM

తెలంగాణ ఆలయాలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది.అయితే తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉన్న ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆలయాన్ని దొంగలు నిర్మించడం జరిగింది?ఏంటి దొంగలు ఆలయం నిర్మించడం అనుకుంటున్నారా? అయితే మనం ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1 / 5
దొంగమల్లన్న ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం, మల్లన్న పేట గ్రామంలో ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి దాదాపు 10 కిలో మీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంటుంది.  దీనికి దొంగ మల్లన్న అనే పేరు రావడం, ఈ ఆలయం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం ఆలయం వెనకున్న జానపదకథల గురించి వివరంగా తెలుసుకుందాం.

2 / 5
11వ శతాబ్దంలో పొలాస రాజుల కాలంలో ఇద్దరు దొంగలు ఒక ఊరికి వచ్చి ఆవులను దొంగిలించారంట. అయితే వారి వెంట ఆ ఊరివారు తరమడం మొదలు పెట్టారు. దీంతో ఆ దొంగలు చాలా భయపడి  పోయారంట. అప్పుడే వారికి తమ పక్కన శివలింగం కనిపిస్తుంది. దీంతో దానిని చూసిన వెంటనే, మమ్మల్ని గుర్తించకుండా కాపాడితే, నీకు గుడి కట్టిస్తాం అని మొక్కుకున్నారంట. దీంతో అప్పటికప్పుడే ఆ ఆవుల రంగు మారిపోయిందంట.అప్పుడు ఆ ఇద్దరు దొంగలు రాత్రికి రాత్రే ఆలయాన్ని నిర్మించారంట.

3 / 5
దీంతో అప్పటి నుంచి ఆ ఆలయాన్ని దొంగ మల్లన్న ఆలయం అంటారంట. మరో కథనం ప్రకరారం చాళక్యుల కాలంలో గ్రామస్థులకు తెలియకుండా ఎవరో రాత్రికి రాత్రి ఆలయాన్ని నిర్మించారంట. అందువలన దీనికి దొంగ మల్లన్న అనే ఆలయం పేరు వచ్చిందని చెప్పుకొస్తు్న్నారు గ్రామస్థులు. అలా ఈ ఆలయం వెనుక అనేక కథలు ఉన్నాయి.  ఇది చాలా మహిమగల ఆలయం. దీని గురించి చెబితే అందరూ ఇది ఒక మాయ అని చెబుతారని చెబుతున్నారు పండితులు.

4 / 5
ఇక ఇక్కడ శివలింగం రూపంలో ఉన్న మల్లన్న స్వామిని, ఆ ఊరి గ్రామస్థులు చుట్టుపక్కల ఉన్నవారు, పూజిస్తూ, ఘనంగా జాతర జరిపిస్తారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుంచి 7 వారాల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. ఆ గ్రామంలో సందడి వాతావరణం కొనసాగుతుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us