
మార్చి రెండు శక్తివంతమైన శుక్ర గ్రహం, చంద్రుడు, రాశి సంచారం చేయనున్నాయి. శుక్రడు మీన రాశిలోకి సంచారం చేసి, దాదాపు 26 రోజుల వరకు అదే రాశిలో సంచరిస్తాడు. అదే విధంగా చంద్రుడు మార్చి 2న సింహ రాశిలోకి ప్రవేశించి రెండు రోజుల పాటు అక్కడే ఉంటాడు. ఈ రెండు గ్రహాల రాశి మార్పు మూడు రాశులపై సానుకూల ప్రభావం చూపనుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి, శక్ర గ్రహం, చంద్ర సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. తప్పకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి లాభ స్థానంలో శుక్రుడు ఉండటం వలన వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహాకారాలు అందుతాయి. అంతే కాకుండా ప్రమోషన్ కూడా పొందే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి పెళ్లి సంబంధాల కోసం చూసే వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవుతుంది.

మీన రాశి : మీన రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా అది చాలా త్వరగా విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలగడంతో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడి చల్లని చూపు మీ ఉడటం వలన సంపద విపరీతంగా పెరుగుతుంది.

ఆస్తి సమస్యలు మీకు అనుకూలంగా వస్తాయి, కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా శుభ కార్యాలు కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.