
సింహ రాశి : గురు సంచారం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కుటుంబంలో కూడా ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి బృహస్పతి గ్రహం సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి వీరు వ్యాపారం ప్రారంభించాలని కంటున్న కల ఈ సమయంలో తీరనుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా, బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ధన్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు సంచారం కారణంగా, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఈ రాశివారు ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాల కలిసి వస్తుంది.

మీన రాశి :మీన రాశి వారికి గురు సంచారము వలన ప్రయోజనం కలుగుతుంది. ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారు ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే కెరీర్ పరంగా కూడా అద్భుతంగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.