
అరటిపండ్లు చలి కాలంలో శ్లేష్మాన్ని పెంచుతాయి. చాలా మందికి ఉదయం అరటిపండ్లు తిన్న తర్వాత శరీరం బరువుగా అనిపిస్తుంది. అందుకే శీతాకాలంలో వాటి తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.

అరటి చెట్టును ఎక్కువగా దేవాలయాలు, ఇంటి అలంకరణ, పూజ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఏ పూజలో అయినా సరే అరటి పండు తప్పకుండా ఉంటుంది. ఇది శుభానికి చిహ్నంకాబట్టి, చాలా మంది అరటి పండును పూజలో తప్పక ఉపయోగిస్తారు. ఇక అలంకరణలో అరటి ఆకులు ఉపయోగించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది.

ఇక హిందూ మతం ప్రకారం అరటి చెట్టు చాలా పవిత్రమైనది. ఇది ఎవరి ఇంటిలోనైతే ఉంటుందో, వారి ఇంటిలో ఆనందం, శ్రేయస్సునెలకొంటుంది. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో నాటుకుంటారు. అయితే దీనిని ఇంటిలోపల ఏదిశలో నాటడం శుభప్రదం అని చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం అరటి చెట్టును ఇంటిలోపల ఈశాన్య దిశలో నాటడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా లక్ష్మీదేవి, విష్ణు మూర్తి ఆశీస్సులు లభిస్తాయంట. ఈశాన్యంలో అరటి మొక్క నాటడం వలన ఇది కుటుంబంలో సానుకూల శక్తిని పెంచడమే కాకుండా, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని పెంపొందిస్తుందంట.

ఇక ముఖ్యంగా గురు వారం రోజున అరటి మొక్కకు పసుపు,కుంకుమ సమర్పించి, దీపం వెలిగించి పూజించడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం లభించి, గ్రహ అడ్డంకులు తొలిగిపోతాయంట. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది.