
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, దీపావళి పండుగకు నాలుగు మొక్కలు బహుమతిగా ఇస్తే అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

మనీ ప్లాంట్ : దీపావళికి ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్ మనీ ప్లాంట్. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి ఉత్తర దిశలో ఉంచితే ధన ప్రవాహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆదాయం పెరుగుతుంది. అందువలన మీ ఇంటికి వచ్చిన అథితులకు మనీ ప్లాంట్ ఇవ్వడం వలన వారు ఆనందంగా ఫీల్ అవుతారు

జెడ్ ప్లాంట్: చాలా మందికి జెడ్ ప్లాంట్ అంటే ఇష్టం ఉంటుంది. ఇధి అదృష్టానికి కూడా చిహ్నం. వాస్తు ప్రాకంర ఈ మొక్క ఉండటం వలన లక్కు కలిసి వస్తుందని చెబుతుంటారు. అందువలన దీపావళి రోజు ఎవరికి అయనా ఈ మొక్కను బహుమతిగా ఇస్తే వారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.

లక్కీ ప్లాంట్ : మీ స్నేహితులకు లేదా బంధువులకు లక్కీ ప్లాంట్ ఇవ్వడం చాలా మంచిది. ఈ దీపావళి మీ జీవితాల్లో మరింత వెలుగులు తీసుకరావాలని లక్కీ ప్లాంట్ బహుమతిగా ఇవ్వండి. ఈ మొక్క ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించి, శాంతి, సౌభాగ్యాలను తెస్తుంది. ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్.

స్నేక్ ప్లాంట్ : స్నేక్ ప్లాంట్ ను 'ఆక్సిజన్ బాంబ్' అంటారు. రాత్రి కూడా ఆక్సిజన్ ఇచ్చే అరుదైన మొక్క ఇది. వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. దీపావళికి దీన్ని గిఫ్ట్ గా ఇస్తే అవతలి వారి ఇంట్లో ఆరోగ్యం, ప్రశాంతత ఉంటాయి. వారికి చాలా సంతోషాన్నిచ్చే గిప్ట్ అవుతుంది ఇది.