
కేవలం పూజించడం మాత్రమే కాకుండా , పండగకు ముందే ఇంటిలో నాలుగు రకాల మొక్కలు నాటుకోవడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా దాని వలన వాస్తు దోషాలు తొలిగిపోయి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందంట.

దీపావళి సమయంలో ఇంటిలో నాటుకోవాల్సిన మొక్కల్లో లక్కీ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మొక్క అదృష్టానికి చిహ్నం.ఈ పండుగ సమయంలో లక్కీ ప్లాంట్‌ను పెంచుకోవడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంచి, పనుల్లో ఆటంకాలను తెలిగిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా దీనిని ఆగ్నేయ దిశలో నాటుకోవాలి.

చాలా మంది దీపావళి పండుగ సమయంలో జాడే మొక్కను నాటుకుంటారు. ఇది చాలా మంచిది. ఈ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఈ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన సంపద , శ్రేయస్సు పెరుగుతుంది, వ్యాపారంలో కూడా కలిసొస్తుంది.

అంతే కాకుండా చాలా మంది దీపావళి సమయంలో తులసి మొక్కను నాటుకుంటారు. ఇది చాలా శుభప్రదం. దీని వలన అష్టైశ్వార్యాలు కలగడమే కాకుండా ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరతాయి. అంతే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. అందువలన తప్పకుండా తులసి మొక్కను ఈ సమయంలో పెంచుకోవాలి.

అలాగే శంఖు పువ్వుల మొక్కను ఇంటిలో నాటుకోవడం కూడా చాలా శుభప్రదం. వాస్తు పరంగా, ఆధ్యాత్మిక పరంగా శంఖు పువ్వుల మొక్కను దీపావళి పండుగకు ముందు ఇంటిలో నాటుకోవడం వలన సిరిసంపదలు పెరుగుతాయంట.