గత జన్మ రహస్యాలు బయటపెడుతున్న పుట్టుమచ్చలు.. ఎలాగో తెలుసుకోండి!

Updated on: Dec 23, 2025 | 10:28 AM

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి. సాముద్రిక శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇది పుట్టుమచ్చలు, వాటి స్థానం, రంగు, ఆకారం బట్టి, వ్యక్తి దురదృష్టం, అదృష్టం, భవిష్యత్తు తెలియజేస్తుంది. చాలా మంది తమ శరీరంలోని పుట్టుమచ్చలను బట్టి, తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. కానీ, ఈ పుట్టుమచ్చలు గత జన్మ రహస్యాలను కూడా వెల్లడిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అది ఎలాగో? ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే, గత జన్మలో ఏం జరిగినట్లో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
శరీరంలోని కొన్ని గుర్తులు, గత జన్మ జ్ఞాపకాలను సూచిస్తాయంట. అలాగే ఒక వ్యక్తి శరీరంపై ఉండే పుట్టు మచ్చలు కూడా, వారు గతజన్మలో అనుభవించిన భయాలు, చేదు సంఘటనల గురించి తెలియజేస్తాయంట. అయితే శరీరంలో ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో ఏం జరిగిందో చూద్దాం.

2 / 5
ఏ వ్యక్తికి అయితే మఖంపై పుట్ట మచ్చ ఉంటుందో, అది చూడగానే కనిపించే విధంగా ఉంటే, వారు గత జన్మలో చాలా భయాందోళనకు గురి అయ్యారని, వారు హింస, ఎగతాళికి గురి అయ్యారని అర్థం అంట. ముఖంపై పుట్టుమచ్చ అనేది, గత జన్మలో వారు పడిన హింసకు గుర్తు అంటున్నారు నిపుణులు.

3 / 5
ఇక ఏ వ్యక్తి అయితే చెవిపై పుట్టుమచ్చ ఉంటుందో, ఆ వ్యక్తి చాలా ఆదధ్యాత్మిక అవగాహన కలిగిన వ్యక్తి, గత జన్మలో ఆయన ఎక్కువగా భక్తిలో మునిగిపోయారని అర్థం. అలాగే నడుము పై లేదా నడుము కింది భాగంలో గనుక పుట్టు మచ్చ ఉన్నట్లు అయితే, ఆ వ్యక్తి గతంలో దోపిడికి గురి అయ్యాడని, చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారని అర్థం అంట.

4 / 5
అదే విధంగా ఏ వ్యక్తికి అయితే చేతులపై ఏ ప్రదేశంలోనైనా సరే పుట్టు మచ్చ ఉంటే, అతను గత జన్మలో సక్సెస్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేసినా, విజయం వరించలేదని, దాని పశ్చా్త్తాపం ఇప్పటికీ ఆయనను వేధిస్తుందని అర్థం, అలాగే కాళ్లపై ఉంటే, అతను తన బంధువుల నుంచి అనేక ఇబ్బందులు పడ్డాడని అర్థం అంటున్నారు నిపుణులు.

5 / 5
అలాగే మెడపై లేదా గొంతుపై పుట్టు మచ్చ ఉన్న వ్యక్తి గత జన్మలో శారీరకంగా, మానసికంగా అణచివేతకు గురి అయ్యాడని అర్థం, అలాగే ఛాతిపై పుట్టు మచ్చ ఉన్న వ్యక్తి గత జన్మలో ఎక్కువగా ఒత్తిడితోనే కాలం వెళ్లదీశారని అర్థం, అంతే కాకుండా పొట్టపై పుట్టు మచ్చ ఉన్న వ్యక్తి గత జన్మలో స్వతంత్రంగా జీవించలేకపోయారని అర్థం, వీపు పై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి గత జన్మలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు )