
అయితే ఈ ధన త్రయోదశి రోజున కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదంట. ఇది ఇంటిలో ఆనందాన్ని, శ్రేయస్సును నింపుతుంది అని చెబుతున్నారు పండితులు. కాగా, ఈ రోజు వాస్తు ప్రకారం, ఆధ్యాత్మికంగా ఏ వస్తువుల కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.

బంగారం, వెండి, రాగి : ధప త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజు ఇవే కాకుండా రాగి, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేసినా ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా రాగి ,ఇత్తడి పాత్రలు కొనడం వలన ఇది అదృష్టాన్ని తీసుకొస్తుంది. బంగారం , వెండి అమ్మవారి అనుగ్రహం కలిగేలా చేస్తుంది.

చీపురు : ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా మంచిది. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువలన ఈ రోజు దీనిని కొనుగోలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది గొప్ప శుభాలను తీసుకొస్తుంది అని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది. చాలా వరకు శుక్రవారం, ధన త్రయోదశి రోజు చాలా మంది ఉప్పు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన ఇది పేదరికాన్ని తొలిగిస్తుందంట. అందువలన ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది.

ధనియాల గింజలు : చాలా మంది ధన త్రయోదశి రోజున బంగారం, వెండి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే దాని కంటే, ఈ రోజున ధనియాలు కొనుగోలు చేయడం చాలా మంచిదంట. ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.