
సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం చాతుర్మాస కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. అయితే ఈ సమయంలో దీపంతో కొన్ని నివారణలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. చాతుర్మాస సమయంలో ప్రతిరోజూ ఏదైనా ప్రత్యేక ప్రదేశంలో దీపం వెలిగిస్తే.. అది విష్ణువుతో , శివుని ఆశీస్సులను కూడా తెస్తుంది.

తులసి మొక్క దగ్గర: తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. అటువంటి పరిస్థితిలో చాతుర్మాస సమయంలో ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క దగ్గర దేశీ ఆవు నెయ్యి దీపంతో వెలిగించండి. ఇలా చేయడం ద్వారా విష్ణువు సంతోషిస్తాడని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని నమ్ముతారు.

నీటి దగ్గర: హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంట్లో త్రాగునీరు ఉంచే ప్రదేశంలో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని, ఆనందం , శాంతి నెలకొంటాయని నమ్ముతారు.

వంటగది: చాతుర్మాస్యం సమయంలో ఇంటి వంటగదిలో దీపం వెలిగించాలి. అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. చాతుర్మాస్యం సమయంలో వంటగదిలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆహారం , డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదని విశ్వాసం ఉంది.

పూజ గది: చాతుర్మాస్యంలో ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించండి. చాతుర్మాస్యంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కనుక ఈ సమయంలో శివుడిని పూజిస్తారు. కనుక ఈ సమయంలో శివయ్య ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. శివుని ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఉంటాయని నమ్మకం.

ఇంటి ప్రధాన ద్వారం: చాతుర్మాస సమయంలో ప్రతి రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి, లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.