
మూల సంఖ్య నెంబర్ 1 ఉన్నవారు గత జన్మలో రాజు, రాణి లేదా నాయకుడిగా ఉండేవారు. వీరు చాలా వరకు నాయకత్వంలో గొప్ప స్థాయిలో ఉండేవారు అంతే కాకుండా తమ అధికార ధోరణితో ఇతరులను బాధపెట్టి ఉండచ్చు. అని చెబుతున్నారు నిపుణులు.

అదేవిధంగా మూల సంఖ్య 2 ఉన్నవారు, కళారంగంలో లేదా సలహాదారుగా ఉండేవారు, అంతే కాకుండా వీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులుగా మిగిలి ఉండేవారంట. అంతే కాకుండా వీరు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిఉంటారు. వీరు చాలా వరకు గత జన్మలో మోసపోయి లేదా, మానసిక క్షోభకు గురి అయి ఉన్నవారు అయి ఉంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థిక సమస్యలు గతంలో ఎక్కువగా ఉండి ఉంటాయి. అనేక ఇబ్బందులతో మరణించినవారై ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

మూల సంఖ్య 3 వీరు నాయకుడు లేదా, తత్వవేత్త, ఉపాధ్యాయుడు, రచయిత అయి ఉండి ఉంటారు. వీరు గతంలో చాలా ప్రతిభను కలిగి ఉండి ఉంటారు. అంతే కాకుండా రహస్య, మంచి ప్రతిభను దాచి పెట్టి ఉంటారంట, వీరు గతంలో సృజనాత్మకత చాలా ఎక్కువ కలిగి ఉన్నవారై ఉన్నారు. వీరు గత జన్మ చాలా సున్నితంగా గడిచిపోయి ఉంటుంది.

మూల సంఖ్య 4 ఉన్నవారు ప్రజల కోసం బాగా కష్ట పడి పని చేసిన వారు, వీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించకుండా తమ జీవితాన్ని పూర్తి చేసి ఉన్నవారు, మూల సంఖ్య 5 ఉన్న వ్యక్తులు ఒక నావికుడు లేదా వర్తకుడు, జూదగాడు అయి ఉంటారు. వీరికి బాధ్యతా రాహిత్యం చాలా ఎక్కువ, మూల సంఖ్య 6 వైద్యుడు, నర్సుగా ఉండే వారు, ఇతరుల ఆకలి బాధలు తీర్చడంలో ముందున్న వ్యక్తి.

గత జన్మలో మూల సంఖ్య 7 ఉన్నవారు, సన్యాసి, రహస్య గూఢచారి జీవితాన్ని అనుభవించినవారై ఉంటారు. వీరు సమజానికి దూరంగా జన్మించి, అలాగే మరణించారు. మూల సంఖ్య 8 ధనవంతులు, భూస్వామి, వీరు పేవారిని మోసం చేసి ఉంటారు, మూల సంఖ్య 9 ఆధ్యాత్మిక గురువు, సమరయోధుడు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.