Best Sleeping Direction: నిద్రించడానికి ఏ దిశలో పడుకోవాలి? తల ఏ వైపు పెట్టాలి?

Updated on: Apr 26, 2026 | 11:32 AM

Sleeping Direction Vastu: జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలు భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైనవి. ఇవి జీవితంలో సానుకూల ఫలితాల కోసం మార్గదర్శకాలు ఇస్తాయి. నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా కీలకం. సరైన నిద్ర అలవాట్లు పాటించడం ముఖ్యం. వాస్తు ప్రకారం ఏ దిశలో తల పెట్టాలి, ఏ దిశలో కాళ్లు ఉంచాలి అనే విషయాలు కూడా సూచిస్తారు. సరైన విధంగా నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.

1 / 6
జ్యోతిష్యం, వాస్తు భారతీయ సంప్రదాయంలో ఎంతో కీలకమైన శాస్త్రాలు. మానవ జీవితంలో సానుకూల ఫలితాలు తీసుకువచ్చేందుకు అనేక ఉపయాలు సూచిస్తాయి. నిద్రకు సంబంధించి కూడా వాస్తు శాస్త్రం పలు సూచనలు చేసింది. ఒక వ్యక్తి ఆరోగ్యం వారి దినచర్యపై ఆధారపడి ఉంటుంది. ఈ దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. నిద్ర అంటే కేవలం కాసేపు కునుకు తీయడం మాత్రమే కాదు.. దానికి మన ఆరోగ్యంతో కూడా సంబంధం ఉంది. శాస్త్రాల ప్రకారం సరైన నిద్ర అలవాట్లను తెలుసుకోవాలి. ఏ వైపునకు తల పెట్టాలి, ఏ వైపునకు కాళ్లు పెట్టాలి అని కూడా తెలిసి ఉండాలి.

జ్యోతిష్యం, వాస్తు భారతీయ సంప్రదాయంలో ఎంతో కీలకమైన శాస్త్రాలు. మానవ జీవితంలో సానుకూల ఫలితాలు తీసుకువచ్చేందుకు అనేక ఉపయాలు సూచిస్తాయి. నిద్రకు సంబంధించి కూడా వాస్తు శాస్త్రం పలు సూచనలు చేసింది. ఒక వ్యక్తి ఆరోగ్యం వారి దినచర్యపై ఆధారపడి ఉంటుంది. ఈ దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. నిద్ర అంటే కేవలం కాసేపు కునుకు తీయడం మాత్రమే కాదు.. దానికి మన ఆరోగ్యంతో కూడా సంబంధం ఉంది. శాస్త్రాల ప్రకారం సరైన నిద్ర అలవాట్లను తెలుసుకోవాలి. ఏ వైపునకు తల పెట్టాలి, ఏ వైపునకు కాళ్లు పెట్టాలి అని కూడా తెలిసి ఉండాలి.

2 / 6
నిద్రపోవడానికి సరైన సమయం.. 
శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం అయిన సుమారుగా మూడు గంటల తర్వాత నిద్రపోవాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. సాయంత్రంపూట నిద్రపోవడం కూడా అశుభంగా భావిస్తారు. నిద్రపోయేటప్పుడు మీ తల గోడ నుండి మూడు చేతుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

నిద్రపోవడానికి సరైన సమయం.. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం అయిన సుమారుగా మూడు గంటల తర్వాత నిద్రపోవాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. సాయంత్రంపూట నిద్రపోవడం కూడా అశుభంగా భావిస్తారు. నిద్రపోయేటప్పుడు మీ తల గోడ నుండి మూడు చేతుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

3 / 6

నిద్రపోవడానికి సరైన దిశ..
నిద్రించే దిశపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. మీరు మీ తలను తూర్పు వైపునకు తిప్పి ఉంచుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం ఈ దిశలోనే జరుగుతుంది. సో.. ఈ దిశలో తల తిప్పి నిద్రించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. అలాగే తలను దక్షిణం వైపునకు తిప్పి కూడా నిద్రపోవచ్చు. అయితే పాదాలు దక్షిణం లేదా తూర్పు వైపునకు పెట్టి ఎప్పుడూ నిద్రపోకూడదు. ఎందుకంటే ఇది మనసులో ప్రతికూలతను పెంచుతుంది. మీకు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

నిద్రపోవడానికి సరైన దిశ.. నిద్రించే దిశపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. మీరు మీ తలను తూర్పు వైపునకు తిప్పి ఉంచుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం ఈ దిశలోనే జరుగుతుంది. సో.. ఈ దిశలో తల తిప్పి నిద్రించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. అలాగే తలను దక్షిణం వైపునకు తిప్పి కూడా నిద్రపోవచ్చు. అయితే పాదాలు దక్షిణం లేదా తూర్పు వైపునకు పెట్టి ఎప్పుడూ నిద్రపోకూడదు. ఎందుకంటే ఇది మనసులో ప్రతికూలతను పెంచుతుంది. మీకు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

4 / 6

వాస్తు చిట్కాలు ఒక వ్యక్తికి ఎలాంటి పడక ఉండాలో కూడా వివరిస్తాయి. విరిగిన, మురికిగా ఉన్న, మరీ ఎత్తైన లేదా మరీ పొట్టి పడకపై ఎప్పుడూ పడుకోకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన పడకపైనే పడుకోవాలి. అలాగే పడకపై కూర్చుని తినకూడదని గుర్తుంచుకోండి.

వాస్తు చిట్కాలు ఒక వ్యక్తికి ఎలాంటి పడక ఉండాలో కూడా వివరిస్తాయి. విరిగిన, మురికిగా ఉన్న, మరీ ఎత్తైన లేదా మరీ పొట్టి పడకపై ఎప్పుడూ పడుకోకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన పడకపైనే పడుకోవాలి. అలాగే పడకపై కూర్చుని తినకూడదని గుర్తుంచుకోండి.

5 / 6

విశ్రాంతి నియమం..

శాస్త్రాల ప్రకారం, ఉదయం నిద్రలేచినప్పుడు కుడి వైపున మంచం దిగాలి. అంతేకాకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే, మొదట వంగి నేలను తాకి, ఆ తర్వాత పాదాలను నేలపై ఉంచాలి.  ఈ అలవాటును పాటించడం వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

విశ్రాంతి నియమం.. శాస్త్రాల ప్రకారం, ఉదయం నిద్రలేచినప్పుడు కుడి వైపున మంచం దిగాలి. అంతేకాకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే, మొదట వంగి నేలను తాకి, ఆ తర్వాత పాదాలను నేలపై ఉంచాలి. ఈ అలవాటును పాటించడం వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

6 / 6

మెుత్తానికి వాస్తు, శాస్త్రాల ప్రకారం నిద్రపోయేటప్పుడు తల దక్షిణ దిశలో పెట్టుకోవడం అత్యుత్తమమైనది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర, మంచి ఆరోగ్యం కలుగుతాయి. తూర్పు వైపున కూడా తల పెట్టుకోవడం కూడా మంచిదే. ఇది జ్ఞాపకశక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మెుత్తానికి వాస్తు, శాస్త్రాల ప్రకారం నిద్రపోయేటప్పుడు తల దక్షిణ దిశలో పెట్టుకోవడం అత్యుత్తమమైనది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర, మంచి ఆరోగ్యం కలుగుతాయి. తూర్పు వైపున కూడా తల పెట్టుకోవడం కూడా మంచిదే. ఇది జ్ఞాపకశక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us