
ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

కన్యా రాశి : ఈ రాశి ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. మార్చి తర్వాత నుంచి అదృష్టం కలిసి వస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని కలలు కంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాల కలిసి వస్తుంది. పనులు వేగంగా పూర్తి అవుతాయి.

వృషభ రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం, వృషభ రాశిలో జన్మించిన వారు త్వరలో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంట. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె తెలియజేశారు. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి మార్చి తర్వాత నుంచి లక్కు కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు.