
ప్రపంచ వ్యాప్తంగా బాల్కన్ నోస్ట్రాడమస్‌గా గుర్తింపు పొంది బాబా వంగా అంచనాలను , ఆమె జ్యోతిష్యానికి ఉన్న ప్రత్యేకత గురించి అంతగా చెప్పాల్సిన పని లేదు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలాయి. అయితే ఈ మధ్య కాస్త గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి.

అయితే బంగారం ధరలకు గురించి బాబావంగా గతంలోనే తన అంచనాలను తెలియజేయడం జరిగిందంట. దీనికి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు విపరీతంగా పెరిగి, జూన్, జూలై మధ్యలో పసిడి ధర భారీగా తగ్గుతుందని ఆమె తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా 2026 సంవత్సరం చివరి అంతంలో కూడా బంగారం ధర విపరీతంగా పడిపోతుందని బాబా వంగా జ్యోస్యం తెలియజేస్తుంది.

అయితే మార్కెట్ నిపుణులు మాత్రం కేవలం అంచనాల మీద ఆధారపడకూడదు, అంతర్జాతీయ విధానాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రూపాయి విలువ ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది అని వారు తెలియజేస్తున్నారు.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు, కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.