
ఈ చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుంది. అయితే గ్రహణం తర్వాత నాలుగు రాశుల వారికి ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయంట. అంతే కాకుండా, రాజయోగం కూడా కలుగుతుందంట. కాగా, ఆ నాలుగు రాశులు ఏవో చూసేద్దాం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి డబ్బు పొదుపు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాల్లో చాలా ఆనందంగా పాల్గొంటారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరుకుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ గ్రహణం చాలా వరకు అదృష్టం తీసుకొస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆఫీసులో పని చేసి ఇంక్రీ మెంట్స్ లేకుండా బాధపడుతున్నారో వారికి ఇది మంచి సమయం. చేసిన పనికి తగిన లాభాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్స్ అందుకోవడం ఖాయం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం వలన చాలా అద్భతంగా ఉంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.