
పురావస్తు శాఖ తవ్వకాల్లో అతి పురాతనమైన దేవాలయం ఒకటి బయటపడింది. ఇది సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయంగా గుర్తించారు. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు.

ఈ దేవాలయం 25వ శతాబ్దానికి చెందిన పురాతన సూర్య భగవానుడి ఆలయంగా అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు.

కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయాల్లో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పురావస్తుశాఖ అధికారి పేర్కొన్నారు.

అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. తాము జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు. ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించగా.. ఇప్పటి రెండు మాత్రమే కనుగొన్నారు.

సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో కూడిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు గుర్తించారు.