
గృహిణి ఆ ఇంటికి అదృష్టం తీసుకొస్తుంది. ఇల్లాలు ఇంటిలో ఎంత ఆనందంగా ఉంటే, ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుందని చెబుతుంటారు. అయితే స్త్రీ ఎంత కోపం వచ్చినా సరే కొన్ని పనులు చేయకూడదంట. అది దరిద్రానికి సంకేతం, ఇంటిలో అనేక ఇబ్బందులు తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు స్త్రీలు ఎంత కోపం వచ్చినా, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూసేద్దాం.

ఎంత కోపం వచ్చినా సరే స్త్రీ రాత్రి సమయంలో అస్సలే ఏడవకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా కోపంతో మాట్లాడటం, తప్పుగా మాటలు అనడం, శాపనార్థాలుపెట్టడం చేయకూడదంట. ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయంట.

అంతే కాకుండా ఎంత కోపం వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నగలు, డబ్బులను విసిరికొట్టకూడదంట. ఏ వస్తువులను అయినా సరే చేతితో విసరగొట్టడం వలన ఇంటిలో దరిద్రం దేవత తిష్టవేస్తుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, మనశ్శాంతి లోపిస్తుందని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా వంటగది లక్ష్మీ స్థానం అంటారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే, ఆ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని వంటింటి పాత్రలు విసిరి గొట్టడం, పగలగొట్టడం చేయడం వలన కూడా దురదృష్టం కలుగుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వంటింటి పాత్రలు విసర గొట్ట కూడదు.

ఇవే కాకుండా చీపురును తన్నడం , విసరడం, ఆహారం తినకుండా నిద్ర పోవడం లాంటిది అస్సలే చేయకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు