
కోడిగుడ్డు వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారం, గరం మసాలాలతో చేస్తారు. ఈ రెసిపీని ఎక్కువగా వేడి అన్నం, చపాతీల్లోకి తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా కోడిగుడ్లను బాగా ఉడికించాలి: ముందుగా ఎగ్స్ తీసుకుని బాగా ఉడకబెట్టి, వాటికీ కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి.

ఇప్పుడు వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకోవాలి: మిక్సీ గిన్నె తీసుకుని దానిలో 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఇంకా కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని పొడి లాగా చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో నూనె వేసి అది వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన గుడ్లను పాన్‌లో వేసి బాగా వేయించాలి.

ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం, గుడ్లకు పట్టేలా 20 నిముషాల పాటు పట్టేలా మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని తినడమే.