
మండే ఎండల్లో చల్లగా పుల్లగా తినే ఫుడ్స్ లో ప్రత్యేకమైన గొట్టం మిక్చర్. అయితే, దీనిని పల్లెటూర్లలో ఎక్కువగా తింటారు. ఇక ఇప్పుడు పట్టణాల్లో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. నిమ్మరసం, మసాలాల కలయికతో చేసే ఈ సాయంత్రం స్నాక్స్ తింటే బాడీ మొత్తం కూల్ అయ్యి ఒంటికి చలువ చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే?

గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు : మూడు కప్పులు గొట్టాలు , ఒక నిమ్మకాయ, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు కప్పుల మరమరాలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర , ఒక చిన్న కప్పు పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి.

ముందుగా మసాలా మిక్స్ తయారు చేసుకోవాలి: ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఉప్పు, మర మరాలు, గొట్టాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చెయ్యాలి. ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమం తయారైన తరవాత ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని రెడీ చేసుకోవాలి.

మట్టి పాత్రలో ఇలా కలుపుకోవాలి: నిమ్మకాయలను చేసి ఒక చిన్న గ్లాస్ అయ్యే వరకు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది రుచిని పెంచుతుంది. ఇక ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుని దానిలో గొట్టం మిక్చర్ వేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి చేతితోనే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఈ గొట్టం మిక్చర్ వలన ఎన్నో లాభాలు : దీనిని వేసవిలో తింటే బాడీ మొత్తాన్ని కూల్ కూల్ చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే పులుపు, కారం పిల్లల్లో ఉండే అలసట, నీరసం కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇది స్ట్రీట్ స్టైల్ టేస్ట్ తో రుచిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు