
బన్ దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బొంబాయి రవ్వను పిడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపను కట్ చేసి, ఒక కప్పు నీటితో మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. సన్న తరిగిన ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చీ, కరివేపాకు, తురిమిన క్యారెట్, వంట సోడా, జీలకర్ర వేసి మంచిగా కలిపి నానబెట్టాలి.

తయారీ విధానం : ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని, మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. నీరు కలపకుండా గ్రైండ్ చేయడం ముఖ్యం. తర్వాత ఒక పెద్ద బంగాళ దుంపను తీసుకొని మెత్తగా ఉడకబెట్టాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, రవ్వలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటిని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, తురిమిన క్యారెట్ వేసి మంచిగా కలుపుకోవాలి. వీటిని వేయడం వలన దోషకు మంచి పోషకాలు అందుతాయి. అంతే కాకుండా ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా వేసి మంచిగా పిండిని కలుపుకోవాలి.

అన్నీ మంచిగా కలిపి పెట్టుకున్నతర్వాత దోసెలు వేసుకోవాలి. దీని కోసం ఒక కడాయిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ నూనె వేసి, వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం మందంగా బన్ దోసెల్లా వేసుకోవాలి.

మూత పెట్టి ఒక వైపు మచిగా కాలిన తర్వాత మరో వైపు కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ బన్ దోసె రెడీ. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ బన్ దోశలను చాలా ఇష్టంగా తింటారు. పల్లీల చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.