Ragi Burfi: ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోవడం పక్కా

Updated on: Nov 06, 2026 | 10:01 PM

చిరుధాన్యాలలో (మిల్లెట్స్) రాగులకు ఉన్న ఔషధ విలువలు సాటిలేనివి. ముఖ్యంగా పిల్లల్లో ఎముకల దృఢత్వానికి, మహిళల్లో రక్తహీనత మరియు క్యాల్షియం లోపాన్ని నివారించడానికి రాగిపిండి అత్యుత్తమ ఆహారం. అయితే పిల్లలు రాగి జావ లేదా రాగి సంగటి తినడానికి మారాం చేస్తుంటారు; అలాంటి వారికి ఎలాంటి తెల్ల పంచదార వాడకుండా, స్వచ్ఛమైన బెల్లం మరియు ఆవు నేతితో నోట్లో వెన్నలా కరిగిపోయేలా 'రాగి బర్ఫీ' చేసి పెడితే చాక్లెట్ కేకుల్లా అమితమైన ఇష్టంతో తింటారు.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు రాగిపిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, 1¼ కప్పుల తురిమిన బెల్లం,  బెల్లం కరిగించడానికి 2 కప్పుల నీళ్లు,  5 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి , ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, అర టీస్పూన్ యాలకుల పొడి

2 / 5
తయారీ విధానం: స్టవ్‌పై వెడల్పాటి పాన్ పెట్టి 2 టీస్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలోకి 1 కప్పు రాగిపిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేయాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ పిండిలోని పచ్చిదనం పోయి కమ్మటి సువాసన వచ్చే వరకు సుమారు 8 నుండి 10 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరొక గిన్నెలో ఒకటింపావు (1¼) కప్పుల తురిమిన బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి.

3 / 5
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత.. మరో 2 నిమిషాల పాటు రోలింగ్ బాయిల్ అయ్యేలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తీగ పాకం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఉన్న వేయించిన రాగిపిండిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అర టీస్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. ఇందులోకి మరిగించి ఉంచుకున్న వేడి బెల్లం నీటిని టీ జల్లెడతో వడకడుతూ నేరుగా పోయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో ఉండలు లేకుండా బాగా కలపాలి. రాగిపిండి బెల్లం నీటిని పీల్చుకుని 2 నిమిషాల్లోనే చిక్కటి ముద్దలా మారుతుంది.

4 / 5
పిండి దగ్గరపడిన తర్వాత.. మధ్యమధ్యలో 2 చెంచాల చొప్పున మొత్తం 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని విడతలవారీగా వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యిని పిండి పీల్చుకుంటూ ఉడికి.. మిశ్రమం మంచి షైనింగ్‌తో మెరుస్తూ పాన్ అంచుల నుండి నెయ్యి వదులుతూ విడివడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి ఈ వేడి మిశ్రమాన్ని వేయాలి. స్పాచులాతో పైన సమంగా పరిచి.. అడుగు భాగం ఫ్లాట్‌గా ఉన్న చిన్న గిన్నెతో పైన నునుపుగా అదిమితే ఎక్కడా గ్యాప్స్ లేకుండా చక్కగా సెట్ అవుతుంది.

5 / 5
గది ఉష్ణోగ్రత వద్ద ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ బోర్లించి తిరగేస్తే కేక్‌లా సులభంగా ఊడి బయటకు వస్తుంది. ఇప్పుడు చాకుతో డైమండ్ లేదా చతురస్రాకార బర్ఫీల్లా కట్ చేసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'రాగి బర్ఫీ' సిద్ధం! చేత్తో తుంచితే వెన్నలా మెత్తగా ఉంటూ, నోట్లో వేస్తే నేతి పరిమళం, బెల్లం కమ్మదనంతో కరిగిపోతూ పిల్లలకు, పెద్దలకు సంపూర్ణ క్యాల్షియం బలాన్ని ప్రసాదిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us