శంఖు పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా? మొక్కను ఇలా పెంచండి!

Updated on: Oct 28, 2026 | 5:54 PM

ప్రతి ఒక్కరి ఇంటిలో అనేక రకాల పూల మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది తమ ఇంటిలో పూజ కోసం ఇంటి వద్ద శంఖు పూల మొక్క, అపరాజిత మొక్కను ఎక్కువగా నాటుకుంటారు. హిందూ మతంలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే దీనిని ఎక్కువగా శివుడు, విష్ణు మూర్తి, దుర్గామాత పూజ సమయంలో కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే ఎక్కువ మంది ఇంటి వద్ద నాటుకుంటారు.

1 / 5
అయితే కొన్ని సార్లు ఇంటి వద్ద నాటుకున్న మొక్కలు చెట్టు వేపుగా పెరిగినా, మొక్క నిండుగా పూయదు. మరి మీ ఇంటిలో కూడా ఈ అపరాజిత మొక్క పూయడం ఆపేసిందా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ ఇంటి మొక్క నిండుగా పూయాలి అంటే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

2 / 5
అపరాజిత మొక్కను చాలా మంది తమ ఇంటి వద్ద పెంచుకుంటారు. ఇది ఇంటికి అందం తీసుకురావడమే కాకుండా, ఈ మొక్క పూలతో టీ చేసుకొని హెర్బల్ టీ తాగడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా శివుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ మొక్కను చాలా మంది పెంచుకుంటారు. కొన్ని సమయాల్లో ఈ మొక్క పెరగదు. అయితే ఆ సమయంలో ఈ చిట్కాలు పాటించాలని ప్రముఖ గార్డెనింగ్ నిపుణులు తుషార్ జోషి తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మొక్కకు సూర్య రశ్మి చాలా అవసరం. అందువలన దీనికి ప్రతి రోజూ ఐదు నుంచి ఆరు గంటల వరకు సూర్య రశ్మి తాకేలా చూసుకోవాలంట. అప్పుడే మొక్క వేపుగా పెరుగుతుంది.

3 / 5
అంతే కాకుండా చాలా మంది మొక్క పెరిగా పూలు పూయకపోతే ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురి అవుతుంటారు. అటువంటి సమయంలో ఈ మొక్క కాయలలో విత్తనాలు ఉంటాయి, వాటిని క్రమం తప్పకుండా కోడం వలన మొక్క ఎక్కువ పూలను ఇస్తుంది. కాయలను కోయకపోతే శక్తి మొత్తం విత్తనాలు, కాయలకు వెళ్లిపోయి, ఎక్కువ పూలను ఇవ్వదు.

4 / 5
అంతే కాకుండా మొక్క చాలా వేపుగా ,దట్టంగా పెరిగితే దానిని సరైన విధానంలో కత్తిరింపులు చేపట్టాలి. దాదాపు వారం రోజులకు ఒకసారి అయినా మంచిగా కొమ్మలను కత్తిరించడం వలన మొక్క ఎక్కువగా మొగ్గలు వేసి ఎక్కువ మొత్తంలో పూలను ఇస్తుంది. అయితే ఎక్కువగా కాకుండా చిన్న చిన్న కొమ్మలు, పాడైన కొమ్మలు, వేపుగా పెరుగుతున్న వాటిని కొంచెం కొంచెంగా కత్తిరించడం చేయాలి.

5 / 5
అలాగే అపరాజిత మొక్కు పదే పదే నీరు పోయడం అవసరం లేదు అని చెబుతున్నారు నిపుణులు. మొక్క వేరు భాగం తేమగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మొక్క మంచిగా పెరుగుతంది. అంతే కాకుండా వారం లేదా 15 రోజులకు ఒకసారి, మొక్క బలహీనపడిన సమయంలో డీఏపీ, అరటి తొక్కల మిశ్రమం ఎరువుగా వేయడం వలన మొక్క ఎక్కువ మొత్తంలో పూలను ఇస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us