
చాలా మంది చట్నీలను తయారు చేసేప్పుడు చేసే కొన్ని తప్పుల కారణంగా అవి త్వరగా పాడవుతూ ఉంటాయి. అలాగే రుచి కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు చేసే చట్నీ హోటల్ లాంటి రుచిలో రావాలంటే.. రుబ్బేటప్పుడు నీళ్లకు బదులుగా 1-2 ఐస్ క్యూబ్స్ వేయండి. దీనివల్ల మిక్సర్ వేడెక్కకుండా, పుదీనా సహజమైన ఆకుపచ్చ రంగు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది చట్నీని మరింత తాజాగా ఉంచడంతో పాటు రుచిని కూడా పెంచుతుంది.

అలాగే మీ చట్నీ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే, కారంగా, పుల్లగా ఉండే రుచి కావాలంటే, ఎప్పుడూ కారంగా ఉన్న పచ్చికాయలను మాత్రమే వాడండి.తక్కువ కారం ఉన్న పచ్చి మిర్చీ వాడడం కారణంగా చట్నీ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి. అలాగే చట్నీ టేస్ట్ మరింత పెరగాలంటే.. అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి.ఇది చట్నీ త్వరగా పలచబడకుండా చేయడంతో పాటు దానికి పులుపును యాడ్ చేసి చట్నీ రుచిని పెంచుతుంది.

చట్నీ ఎక్కువ రోజులు రావాలంటే.. మీరు చట్నీ రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా నూనె కలపడం అలవాటు చేసుకోండి. చట్నీ రుబ్బేటప్పుడు 1-2 టీస్పూన్ల ఆవనూనె కలపడం వల్ల అది మృదువుగా తయారై, దాని రుచిని మెరుగుపరుస్తుంది. అలాగే త్వరగా పాడవకుండా, బూజు పట్టకుండా, చట్నీ నల్లబడకుండా చేస్తుంది.

అలాగే చట్నీ చేసేకునేందుకు ఎప్పుడూ తాజాగా ఉన్న కొత్తిమీర లేదా పుదీనా ఆకులను మాత్రమే వాడండి.. ఈ విషయంలో మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చట్నీ రుచిని, రంగు పాడవుతుంది. కాబట్టి నల్లగా మారినా, లేదా వాడిపోయిన కొత్తిమీర, పుదీన ఆకులను అస్సలు వాడొద్దు. అలాగే గ్రీన్ చట్నీ రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా పసుపు పొడి కూడా కలపండి. అవసరమైతే నేరుగా మీరు పసుపు కొమ్ములను తెచ్చి దంచుకొన్న పసుపునే వాడండి. ఇది రుచితో పాటు రంగును కూడా పెంచుతుంది.

ఇక్కడే మీకు అసలైన టాస్క్ ఉంది. మీరు చట్నీ ఎంత టేస్ట్‌గా తయారు చేసినా.. అది ఎక్కవ రోజులు నిల్వ ఉండాలంటే.. దాన్ని ఎలా స్టోర్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. మీ ఇంట్లో చట్నీ మిగిలిపోయినప్పుడూ దానిని శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టండి. ప్రతిసారీ బయటకు తీసేటప్పుడు పొడి, శుభ్రమైన చెంచాను ఉపయోగించండి. ఇది చట్నీని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు)