Starling Birds: వేలాది పిచ్చుకలాంటి చిన్న పక్షులు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా..

|

Dec 17, 2021 | 9:03 AM

పక్షుల గురించి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. రాబందుల వంటి పెద్ద పక్షుల నుంచి తమను తాము రక్షిచుకోవడానికి స్టార్లింగ్ పిట్టలు ఏమి చేస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పక్షుల కథేమిటో ఫోటోలలో చూడండి

1 / 6
ఈ చిన్ని పిట్టను చూశారా? చూస్తుంటే అచ్చు మన పిచ్చుకలానే ఉంది కదూ. దీనిని స్టార్లింగ్ అంటారు. ఈ పక్షి  బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ సహా ఐరోపాలోని అన్ని చల్లని దేశాల్లోనూ కనిపిస్తుంది.

2 / 6
ఈ పక్షులు  ధాన్యం.. నీటిని వెతుకుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అవి ఆకాశంలో గుంపులుగా బయటకు వస్తాయి. అప్పుడు చూడటానికి ఒక ద్భుతంలా కనిపిస్తుంది ఆ దృశ్యం. రాబందుల వంటి పక్షుల బారిన పడే ప్రమాదం లేకుండా ఇవి ఇలా ఒకేసారి గుంపుగా పైకి ఎగిరి వెళతాయి.

3 / 6
ఈ పిట్టల ప్రత్యేకత ఏమిటంటే, అవి ఎగిరినప్పుడు, సమూహంలో కనీసం వెయ్యికి పైగా పక్షులు ఉంటాయి. ఐరోపాలో భారీ హిమపాతం ప్రారంభమైనప్పుడు, ఈ పక్షులు.. నీటి కోసం ఆసియాకు వెళ్తాయి. వీటిలో, రోసీ స్టార్లింగ్ బృందం వర్షాకాలం ముగింపులో భారతదేశం వైపు వస్తుంది.

4 / 6
యూరప్ నుంచి కజకిస్తాన్, పాకిస్థాన్ మీదుగా భారత్ సరిహద్దు ప్రాంతాలకు ఈ పక్షుల గుంపు చేరుకుంటుంది. భారతదేశంలో ఈ పక్షులకు ఇష్టమైన ప్రదేశాలలో రాజస్థాన్ ఒకటి. ఇక్కడ ఇవి తరచుగా ఏప్రిల్ వరకు ఉంటాయి. ఒక సమూహంలో 1000 నుండి 10 వేల పిట్టలు ఉంటాయి. హిమపాతం తరువాత, అవి ఆహారం కోసం ఆసియా వైపు వస్తాయి.

5 / 6
ఈ పక్షుల సగటు వయస్సు 6-7 సంవత్సరాలు. ఇవి ఏడు నెలల పాటు యూరప్ లో ఉంటాయి. మిగిలిన ఐదు నెలలు యూరప్ వెలుపల ఉంటాయి. అప్పుడు ఇవి  బ్రీడింగ్ అవుతాయి.

6 / 6
ఎకో ఫ్రెండ్లీ పక్షి: స్టార్లింగ్ ఎకో ఫ్రెండ్లీ పక్షి. వాటి ఆహారం వర్షం వల్ల వచ్చే కీటకాలు..సాలెపురుగులు. మర్రిలో పండే పండ్లను కూడా తింటుంది.